శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఈదుపురంలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఎమెల్యేలు పాల్గొన్నారు.
అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణంలో పంచాయితీ రాజ్ ప్రభుత్వ గెస్ట్ హౌస్ వద్ద మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని అన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపారు.
వికారాబాద్ జిల్లా దోమ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 8వ తరగతి మైనర్ బాలికపై నలుగురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై దోమ పోలీసు స్టేషన్లో బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. దీంతో.. పోలీసులు నలుగురు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు.
IPL 2025కి ముందు నిర్వహించే మెగా వేలం కోసం ఆటగాళ్ల నిలుపుదల (Retention), విడుదల (Release) జాబితా విడుదల చేయబడింది. గురువారం మొత్తం 10 ఫ్రాంచైజీలు ఐపీఎల్ 2025 కోసం తమను కొనసాగించాలనుకుంటున్న పేర్లను ప్రకటించగా.. అదే సమయంలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు జట్లు వదిలేశాయి.
ప్రపంచ వ్యాప్తంగా దీపావళి సందడి కనిపిస్తోంది. అయితే.. దీపావళి రోజున మనమంతా కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తుంటే, దేశ రక్షణ కోసం ఆర్మీ జవాన్లు సరిహద్దుల్లో మోహరించి తమ కర్తవ్యాన్ని శ్రద్ధగా నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో.. దేశ ప్రధాని మోడీ సైనికులను ప్రోత్సహించారు. గుజరాత్‌లోని కచ్‌లో బీఎస్ఎఫ్ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు. మోడీ వారితో కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులను బురిడీ కొట్టిస్తూ పుష్ప సినిమా తరహాలో గంజాయిని తరలిస్తున్న ముఠాను కొమురం భీం జిల్లా వాంకిడి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్ర సరిహద్దు దాటే క్రమంలో పోలీసులు చాకచక్యంగా దొరకబట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా జిల్లా ఎస్పీకి సమాచారం వచ్చింది. దీంతో.. చెక్ పోస్ట్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ట్యాంకర్లో ఉన్న సుమారు 250 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్‌లో రెండు చోట్ల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నార పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో హాష్ ఆయిల్ పట్టుకున్నారు. బండ్లగూడలో 300 ఎంఎల్ హాష్ ఆయిల్‌ను టీఎస్ఎన్ఏబీ (TSNAB) అధికారులు సీజ్ చేశారు. ఓ కిలేడీ లేడీ.. గుట్టు చప్పుడు కాకుండా హాష్ ఆయిల్ విక్రయిస్తుంది. ఈ క్రమంలో.. విశ్వసనీయ సమాచారం మేరకు బండ్లగూడలో రహీమ్ ఉన్నీసా అనే లేడీ ఇంట్లో అధికారులు సోదాలు జరిపారు.
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో దారుణం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమ పేరుతో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు. ఇన్‌స్టాలో వికారాబాద్ జిల్లా బషీరాబాద్ (మం) జివంగి గ్రామానికి చెందిన చెందిన వినీల్ (19), న్యాల్కల్‌కి చెందిన ఓ బాలిక(16) పరిచయం ఏర్పడింది. ఏడు నెలలుగా ప్రేమ పేరుతో ఇన్‌స్టాలో బాలికతో చాటింగ్, కాల్స్ చేశాడు. కాగా.. ఇటీవల యువకుడు బాలిక గ్రామానికి వచ్చి ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
హైదరాబాద్ గాంధీ భవన్లో ఇందిరా గాంధీ వర్ధంతి, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ హనుమంతరావు, ఎంపీ అనిల్ యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించారు.