67వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ) కోసం ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియాకు పయనమయ్యారు. కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ ( సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్, స్టీరింగ్ కమిటీకి ఛైర్పర్సన్ ఎంపీ పురంధేశ్వరి ఆస్ట్రేలియా దేశంలోని సిడ్ని నగరంలో 67వ సీపీసీలో పాల్గొననున్నారు.
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ట్విట్టర్లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అబద్దాలు ఆడడంలో అంబటిది అందె వేసిన చెయ్యి అని.. ప్రాజెక్టు ఎత్తు తగ్గించినట్లు ఆధారాలు ఉంటే చూపాలన్నారు. నిద్రపోయే వాణ్ణి లేపవచ్చని.. నిద్ర నటించే వాణ్ణి ఎవరు లేపగలరని అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్‌ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్‌లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు.
రుషికొండ నిర్మాణాలు చూస్తే గుండె చెదిరే నిజాలు వెలుగు చూస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అధికారం అడ్డు పెట్టుకొని చేసే తప్పులకు ఇదో కేస్ స్టడీ అంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటివి సాధ్యమా అనిపించిందని.. కలలో కూడా ఊహించలేమన్నారు. ఇటువంటి నేరాలు చెయ్యాలంటే చాలా తెగించాలి.. ఒక వ్యక్తి విలాసాల కోసం ఇంత దారుణమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చాలా దేశాలు తిరిగానని, పాలకులను చూశాను కానీ ఒక సీఎం విలాసం…
ఒక్క పరుగుతో యూఏఈ చేతిలో ఓడిన టీమిండియా హాంకాంగ్ సిక్స్ టోర్నమెంట్లో భారత్, యూఏఈ మధ్య ఉత్తేజకరమైన మ్యాచ్ జరిగింది. అయితే, మ్యాచ్ లో టీమిండియా 1 పరుగు తేడాతో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో, యూఏఈ 6 ఓవర్లలో 130 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 6 ఓవర్లలో 129 పరుగులు మాత్రమే చేయగలిగింది. దాంతో ఒక పరుగుతో మ్యాచ్‌ను కోల్పోయింది. యూఏఈపై టీమిండియా కెప్టెన్ రాబిన్ ఉతప్ప 10 బంతుల్లో 3…
అక్టోబర్ నెలలో వేడిని అనుభవించారా..? 2024 అక్టోబర్ దేశంలోనే అత్యంత వేడిగా ఉండే నెలగా నమోదైంది. వాతావరణ శాఖ ప్రకారం.. గతంలో 1951 అక్టోబర్‌లో చాలా వేడిగా ఉన్నట్లు నమోదు కాగా.. తాజాగా 120 ఏళ్ల తర్వాత మళ్లీ చోటు చేసుకుంది. ఈ సంవత్సరం అక్టోబర్‌లో మధ్య భారతదేశంలోని (మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్)లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి. అంతేకాకుండా.. ఢిల్లీ NCR సహా ఉత్తర-పశ్చిమ భారతదేశంలో కూడా అక్టోబర్ నెలలో ఎక్కువ వేడి నమోదైంది.
సీఎం చంద్రబాబు ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటన కొనసాగుతోంది. అయితే ముఖ్యమంత్రి పర్యటన ఆసక్తిని రేపుతోంది. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం నేరుకు రుషికొండకు చేరుకున్నారు.
తిరుపతి జిల్లా వడమాలపేట మండలం ఏఎం పేట ఎస్టీ కాలనీలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని హోంమంత్రి అనిత ఆదివారం పరామర్శించనున్నారు . అభం శుభం తెలియని చిన్నారికి చాక్లెట్లు ఆశ చూపి దారుణానికి పాల్పడిన నిందితుడిని చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని బాధిత కుటుంబాన్ని కలిసి స్వయంగా ఆమె భరోసా అందించనున్నారు .
మొదటి రోజు డ్రెస్సింగ్ రూమ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు.. ఏదో చెబుతున్నట్లు కనిపిస్తున్నాడు. వీడియోలో ఆ మూమెంట్ చూస్తే.. పంత్‌ను రోహిత్ శర్మ తిట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే.. వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణ జరిగిందో తెలియదు కానీ.. రోహిత్ శర్మ రిషబ్ పంత్‌పై ఏదో విషయంలో కోపంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల వద్ద యురేనియం తవ్వకాలను నిలిపివేయాలని చేపట్టిన ఆందోళనను గ్రామస్థులు తాత్కాలికంగా విరమించారు. ఈ నెల 4వ తేదీన కలెక్టర్ వచ్చి చర్చిస్తారనే హామీతో ప్రజలు ఆందోళనను విరమించారు.