ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రిషబ్ పంత్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఫ్రాంచైజీ పంత్‌ను విడుదల చేయడంతో 2020 ఫైనలిస్ట్‌లతో పంత్ తొమ్మిదేళ్ల అనుబంధం ముగిసింది. కాగా.. ఢిల్లీ జట్టు రిటెన్షన్ లిస్ట్‌లో అక్షర్ పటేల్ మొదటి ఎంపికగా ఉన్నారు. అయితే.. సహ-యజమాని జీహెంఆర్ (GMR) గ్రూప్ తీసుకున్న నిర్ణయాలపై పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. జీహెంఆర్ గ్రూప్ తదుపరి రెండేళ్లపాటు ఫ్రాంచైజీని నిర్వహిస్తుంది. జీహెంఆర్ గ్రూప్ ఇటీవల కోచింగ్ సిబ్బందిలో కూడా మార్పులు చేసింది.
Read Also: IND vs NZ: రెండో రోజు ముగిసిన ఆట.. చెలరేగిన టీమిండియా స్పిన్నర్లు
హేమాంగ్ బదానీని హెడ్ కోచ్‌గా, వేణుగోపాల్ రావును జట్టు డైరెక్టర్‌గా నియమించాలనే నిర్ణయంపై పంత్ అసంతృప్తిగా ఉన్నారు. అంతే కాకుండా.. జీఎంఆర్ గ్రూప్ తన స్వేచ్ఛను అడ్డుకోవడంపై కూడా పంత్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో.. పంత్ నుంచి కెప్టెన్సీని తప్పించి అక్షర్ పటేల్‌కు అప్పగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆలోచిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 2016 మెగా వేలంలో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరాడు. గత రెండు మెగా వేలంలో అతడిని రిలీజ్ చేయలేదు. గత మెగా వేలంలో పంత్ ఫ్రాంచైజీతో వేలం టేబుల్ వద్ద కూర్చుని నిర్ణయాలు తీసుకోవడం కనిపించింది. కాగా.. JSW గ్రూప్, GMR గ్రూప్ మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ 50-50 శాతం వాటాను కలిగి ఉంది. ప్రతి గ్రూప్ రెండు సంవత్సరాల పాటు ఫ్రాంచైజీని నడుపుతుంది. 2025, 2026 ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ GMR గ్రూప్ కింద ఉంటుంది.. ఆ గ్రూప్ దర్శకత్వంలో ఆడుతుంది.
Read Also: Amaran: రెండు రోజుల్లో దళపతి ‘గోట్’ కలెక్షన్ రికార్డును బద్దలు కొట్టిన అమరన్?
జీఎంఆర్ గ్రూప్ నిర్ణయం కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రికీ పాంటింగ్‌ను హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. పాంటింగ్ ఏడేళ్లపాటు జట్టుకు ప్రధాన కోచ్‌గా పని చేశారు. అంతేకాకుండా.. టీమిండియా డైరెక్టర్‌గా ఉన్న వెటరన్ క్రికెటర్ సౌరవ్ గంగూలీని కూడా తొలగించారు. ఈ మార్పులు పంత్‌ను అసంతృప్తికి గురి చేశాయి.. దీంతో వేలంలో వేరే ఫ్రాంచైజీకి ఆడాలని నిర్ణయించుకున్నాడు. కాగా.. రిషబ్ పంత్ ఈ ఏడాది టీమిండియాకు టీ20 ప్రపంచ కప్‌ను గెలిపించిన ఆటగాళ్లలో ఉన్నాడు.