Road Accident: హైదరాబాద్‌లోని షాపూర్ నగర్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వాహనదారుడిని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అతివేగంతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రాథమిక దర్యాప్తులో మృతుడు రాంకీ సంస్థలో పనిచేసే హరికృష్ణగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఘటనాస్థలిలో ప్రమాదానికి కారణమైన బస్సుపై వాహనదారులు దాడి చేసి అద్దాలను పగలగొట్టారు. ఉదయం రోడ్లపై పని చేస్తున్న మున్సిపల్ కార్మికులు, స్థానికులు రోడ్డుపై…
మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసుపై నేడు నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ జరపనుంది. గత విచారణలో కేటీఆర్, దాసోజు శ్రవణ్ ల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన కోర్టు.. ఈ రోజు మిగతా ముగ్గురు సాక్షులు తుల ఉమ, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ల స్టేట్మెంట్లను కోర్టు రికార్డ్ చేయనుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు వచ్చాయి. శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని మూడు విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్ నుండి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుండి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.
ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బీసీ కులగణనపై కాంగ్రెస్ దృష్టి సారించింది. ఇవాళ గాంధీ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో కీలక సమావేశం జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది.
సోడాలు, వివిధ రకాల కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వల్ల గుండె సమస్యలు, స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే.. ఇవే కాకుండా, పండ్ల రసాల వల్ల కూడా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉన్నట్లు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ గాల్వే, మెక్‌మాస్టర్ యూనివర్శిటీ, కెనడా నిపుణులు, అంతర్జాతీయ స్ట్రోక్ నిపుణుల బృందం చేసిన తాజా పరిశోధనలో ఇది వెల్లడైంది.
ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోంది.. తిరుపతికి రావడం ఎంతో సంతోషంగా ఉంది అని మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. ఇక, 140 రోజుల్లో ముఖ్యమంత్రి ఐదు ఫైళ్లపై సంతకం చేశారు.. ప్రతి పేద వాడికి ఈ ప్రభుత్వం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుందన్నారు. అలాగే, ప్రపంచం మొత్తం ఆంధ్ర వైపు చూస్తోంది అని వ్యాఖ్యానించారు. రాబోయే 2, 3 సంవత్సరాల్లో ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని అభివృధ్ది చేస్తాం.. అభివృధ్ది,సంక్షేమం రెండు కళ్ళ లాంటివని…
ప్రపంచవ్యాప్తంగా హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వ్యాధి కారణంగా భారతదేశంలో ప్రతిరోజూ 9 వేల మంది మరణిస్తున్నారు. ప్రతిరోజూ ఇంత పెద్ద సంఖ్యలో మరణాలు పెరగడానికి రెండు సమస్యలు కారణం.. అవెంటంటే కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్. రక్తంలో ఇవి పెరిగితే గుండె ఆరోగ్యానికి ప్రమాదం ఉంటుంది. అయితే.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం గురించి మనం చాలా మాట్లాడుకున్నాం.. కానీ ట్రైగ్లిజరైడ్ల గురించి తెలియదు.
రాగులను తీసుకుంటే మధుమేహం, ఊబకాయం రెండింటినీ సులభంగా నియంత్రించవచ్చు. అంతే కాకుండా.. రాగుల వినియోగంతో ఇతర ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
హైదరాబాద్‌లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేస్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ నిధుల కేటాయింపులపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేసింది. నిధుల బదలాయింపుపై విచారణ జరపాలని కోరింది.
సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయాలనేది తన అభిమతం అన్నారు. కేటీఆర్తోని కేసీఆర్ ఉనికి లేకుండా చేశాను.. కేసీఆర్ ఉనికి లేకుండా చేయడానికి ఆయన కొడుకునే వాడానని అన్నారు. ఇక భవిష్యత్తులో కేటీఆర్‌ని రాజకీయంగా లేకుండా చేయడానికి ఆయన బావ హరీష్ రావుని వాడుతానని తెలిపారు.