Nandamuri Mokshagna Debut: ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో బాలయ్య వారసుడి ఎంట్రీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Mokshagna Debut: నందమూరి అభిమానులు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ తేజ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఒక కల్ట్ క్లాసిక్ సినిమాకు సీక్వెల్‌తో మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం అవుతున్నాడని టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగే ఈ కథకు కొనసాగింపుగా ‘ఆదిత్య 999 మ్యాక్స్’ను ప్లాన్ చేశారు మేకర్స్. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో వారసుడు వెండి తెరపై కనిపిస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్న నందమూరి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెబుతూ.. మోక్షజ్ఞ ఈ భారీ ఫ్రాంచైజీలోకి ఎంటర్ అయ్యాడని ప్రస్తుతం సినీ సర్కిల్‌లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
READ ALSO: Su-57 fighter Jet: రష్యా Su-57 ఫైటర్ జెట్ కొనుగోలుకు భారత్ ఆసక్తి..
Also Read
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును డైరెక్టర్ క్రిష్ జగర్లమూడి తెరకెక్కించబోతున్నారని టాక్ నడుస్తుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రాత్మక చిత్రంతో బాలయ్యకు కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చిన క్రిష్, ఇప్పుడు మోక్షజ్ఞను ఏ రేంజ్‌లో వెండితెరప ప్రెజెంట్ చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హై-క్వాలిటీ విజువల్స్, డీప్ ఎమోషన్స్, పక్కా మాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా ఉండబోతుందని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా హై టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. షూటింగ్ షెడ్యూల్, ఫస్ట్ లుక్ అప్‌డేట్స్ త్వరలోనే వచ్చే అవకాశం ఉందని సమాచారం.
READ ALSO: Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు