మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఐదు నెలల గర్భిణిని ఆసుపత్రి బెడ్‌పై ఉన్న రక్తాన్ని శుభ్రం చేయించారు ఆస్పత్రి సిబ్బంది. అంతకుముందు.. ఆ బెడ్ పై తన భర్త చనిపోయి ఉన్నాడు. ఈ క్రమంలో.. క్లీన్ చేయాలని తనపై ఒత్తిడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అన్నమయ్య జిల్లా రాజంపేటలో యువ దంపతుల్లో భార్య అదృశ్యం అయింది. నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం సీసీ కండ్రిగ గ్రామానికి చెందిన భర్త వెల్లూరు రాజా (22), భార్య పెంచలమ్మ (20).. దీపావళి పండుగ కోసమని అన్నమయ్య జిల్లా చిట్వేలులోని అత్తగారి ఇంటికి వెంకటగిరి నుంచి బయల్దేరారు. అయితే.. రాపూరు బస్టాండ్ నుంచి బస్సులో ముఖానికి మాస్క్ వేసుకుని ఉన్న ఒక్క అపరిచిత వ్యక్తితో దంపతులు రాజంపేట పాత బస్టాండ్‌లో దిగారు.
తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు.. సీఎం కీలక వ్యాఖ్యలు ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. చంపినపుడు పీడ విరగడైందని ప్రజలు సంబరాలు, దీపావళి చేసుకున్నారు.. తాజా ఎన్నికల్లో నరకాసురుడిని ఓడించామని చంద్రబాబు…
మాజీ మంత్రి మేరుగు నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ.. ఎవరో ఒక మహిళ తాడేపల్లి పోలీసు స్టేషన్లో తనపై ఫిర్యాదు చేసిందని.. తాను ఆమెను శారీరకంగా లోబర్చుకుని, రూ. 90 లక్షలు తీసుకున్నానని ఆరోపిస్తుందని అన్నారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధం అని తెలిపారు.
ఉచిత గ్యాస్ సిలిండర్లపై వైసీపీ దుష్ప్రచారం సిగ్గుచేటని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, కలెక్టర్ తమీమ్ అన్సారియాలతో కలసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతోందన్నారు.
ఇటీవలే మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన ముగించుకుని తిరిగివచ్చారు. ఈ క్రమంలో.. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. రెడ్ బుక్‌లో రెండు చాప్టర్ ఓపెన్ అయ్యాయని.. త్వరలో మూడో చాప్టర్ కూడా ఓపెన్ అవుతుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్.
ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు.. కానీ మనస్సు, మానవత్వం ఉందని అన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించి.. టీ చేసిన సీఎం! ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంను సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలంలోని ఈదుపురం నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టారు. ఈరోజు ఈదుపురంలో లబ్ధిదారల ఇంటికి వెళ్లిన బాబు.. దీపం 2.0 పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందజేశారు. శాంతమ్మ అనే మహిళ ఇంట్లో స్వయంగా స్టవ్ వెలిగించిన సీఎం.. టీ చేసి తాగారు. శాంతమ్మ…
ఏలూరు జిల్లా ద్వారక తిరుమల మండలం ఐఎస్ జగన్నాధపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తుండగా.. ఆయన అభిమానులు OG..OG అంటూ కేకలు వేశారు. దీంతో పవన్ మాట్లాడుతూ.. సినిమా పేర్లు జపించడం కంటే భగవన్నామస్మరణ చేస్తే బాగుంటుందని అభిమానులకు సూచించారు. సినిమాలు ఒక సరదా మాత్రమే.. సినిమాలు ఉండాలని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.