High Court: “జాతకం” పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు.. హైకోర్టు కీలక తీర్పు..
- శృంగారం తర్వాత, జాతకం కలవలేదని చెబితే ఎలా..
- జాతకం పేరుతో మోసం చేస్తే రేప్ కేసు తప్పదు..
- ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
High Court: పెళ్లి చేసుకుంటానని నమ్మించి, మహిళతో పెళ్లికి ముందు లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ‘‘జాతకం’’ కలవడం లేదని చెబితే అత్యాచారం కేసు తప్పదని ఢిల్లీ హైకోర్టు ఓ కేసులో కీలక తీర్పును చెప్పింది. శారీరక సంబంధం పెట్టుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ‘‘కుండలి’’ కలవడం లేదని పెళ్లికి నిరాకరించడం నేరంగా పరిగణించవచ్చని కోర్టు పేర్కొంది.
పెళ్లి చేసుకుంటానని పదే పదే నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఒక మహిళ ఒక వ్యక్తిపై రేప్ కేసు పెట్టింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిల్ నిరాకరించింది. నిందితుడిపై IPC సెక్షన్ 376, BNS సెక్షన్ 69 కింద కేసులు నమోదయ్యాయి.
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
Read Also: Su-57 fighter Jet: రష్యా Su-57 ఫైటర్ జెట్ కొనుగోలుకు భారత్ ఆసక్తి..
ఈ కేసులో వివరాలను పరిశీలిస్తే.. నిందితుడు బాధితురాలికి పంపిన వాట్సాప్ మెసేజ్‌లో ‘‘మన జాతకాలు కాలిశాయి. పెళ్లికి అడ్డంకులు లేవు. రేపే పెళ్లి చేసుకుందాం’’ అని పేర్కొన్నట్లు కోర్టు గుర్తించింది. దీంతో బాధిత మహిళ నిందితుడు, అతడి కుటుంబంపై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంది. అయితే, మళ్లీ నిందితుడు ‘‘జాతకాలు ’’ కలవడం లేదు, పెళ్లి కుదరదు అని చెప్పడాన్ని కోర్టు గుర్తించింది. నిందితుడు గతంలో చెప్పిన మాటలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నట్లు గుర్తించింది.
ఈ కేసుపై న్యాయమూర్తి వ్యాఖ్యానిస్తూ.. జాతకాలు కలవడం ముఖ్యమైతే శారీరక సంబంధం ఏర్పడకముందే ఆ విషయాన్ని తేల్చుకోవాలని అన్నారు. ముందే పరిష్కారం అయిన విషయాన్ని మళ్లీ సాకుగా చూపడం కేవలం శారీరక సుఖం కోసమే ‘‘తప్పుడు హామీ’’ ఇచ్చినట్లు అర్థమవుతుందని కోర్టు అభిప్రాయపడింది.
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్‌షిప్ లాంచ్.!