Virosh: ఒకేరోజు రెండు సార్లు పెళ్లి చేసుకోనున్న విజయ్ – రష్మిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటి వారు కాబోతున్నారు. గత కొంతకాలంగా వీరి పెళ్లి గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహ వేడుకలు అత్యంత వైభవంగా, అంతే ప్రైవేట్‌గా నేటి సాయంత్రం నుండే ప్రారంభం కానున్నాయి. ఈ వేడుక కోసం ఇరు కుటుంబ సభ్యులు ఇప్పటికే ఉదయ్‌పూర్ చేరుకున్నారు. ఆడంబరాలకు దూరంగా, కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరగనుంది. మొత్తం అతిథుల సంఖ్య వందకు మించకుండా జాగ్రత్త పడ్డారు. నేటి సాయంత్రం జరిగే ‘సంగీత్’ వేడుకతో ఈ సంబరాలు అట్టహాసంగా మొదలుకానున్నాయి.
Also Read:Nandamuri Mokshagna Debut: ‘ఆదిత్య 999 మ్యాక్స్’తో బాలయ్య వారసుడి ఎంట్రీ!
Also Read
విజయ్, రష్మికల వివాహ క్రతువులో అటు తెలుగు సంప్రదాయాన్ని, ఇటు కొడవ (కూర్గ్) పద్ధతులను మేళవించబోతుండటం విశేషం. రేపు బుధవారం ఉదయం ‘హల్దీ’ వేడుక, సాయంత్రం ‘మెహందీ’ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 26 రోజే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఉదయం తెలుగు సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరగనుండగా, సాయంత్రం రష్మిక సొంత ఊరి పద్ధతి అయిన కొడవ స్టైల్‌లో వివాహ వేడుక జరగనుంది. ఉదయ్‌పూర్‌లో వేడుకలు ముగించుకుని ఈ జంట శుక్రవారం నాడు హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఇక చిత్ర పరిశ్రమ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వీఐపీల కోసం మార్చి 3న బంజారాహిల్స్‌లోని తాజ్ కృష్ణలో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.
తాజావార్తలు
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!