వై నాట్ పులివెందుల అంటున్న టీడీపీ నాయకత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? ఈసారి ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలో సీఎం జగన్‌ని ఓడించాలనుకునే పార్టీ ఎలా ఉండాలి? ఇప్పుడెలా ఉంది? అసలక్కడి నాయకత్వ తీరుపై టీడీపీ అధిష్టానం ఏమనుకుంటోంది? లెట్స్ వాచ్.
కిడ్ని సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా..? కిడ్నిలో రాళ్లతో ఎటు తిరగలేకపోతున్నారా..? కిడ్నీలో స్టోన్ వచ్చిన వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. ఎందుకంటే పొత్తి కడపులోంచి నొప్పి పొడుచుకొస్తుంది. అంతేకాకుండా యూరిన్ కు వెళ్తే.. మంటతో బాధపడుతారు. మహిళ కన్నా.. పురుషుల్లోనే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఒకసారి కిడ్నీలో రాళ్లు వచ్చినవారు.. తగు జాగ్రత్తలు తీసుకోకపోతే మళ్లీ తిరగబెట్టొచ్చు.
చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానిపల్లెలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శవాన్ని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా.. విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కొట్టి ముగ్గురు మృతి చెందారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. ఎగువ, దిగువ కాఫార్ డ్యాం, గైడ్ బండ్ తదితర పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Qoo Neo 7 Proకు సంబంధించి కీలక వివరాలు వెలుబడ్డాయి. కొత్త iQoo స్మార్ట్‌ఫోన్ జూలై 4న ఇండియాలో లాంచ్ కానుంది. వేగన్ లెదర్ బ్యాక్‌ను కలిగి ఉన్న ఆరెంజ్ కలర్ ఆప్షన్లో ఫోన్ డిజైన్‌ను iQoo టీజ్ చేసింది. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ఫోన్లో మాట్లాడిందని ఆమెను దారుణంగా గొంతుకోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. ఈ దారుణ ఘటన హర్యానాలో ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఓ హోటల్లో 24 ఏళ్ల మహిళను ఆమె ప్రియుడు హత్య చేశాడు.