Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pune Baby Fevikwik: కుటుంబంలో తలెత్తిన గొడవలు పెద్దల మధ్యే ముగియాలి. ఆకోపాన్ని విచక్షణ కోల్పోయి పసిప్రాణాల మీద చూపిస్తే అది కేవలం నేరం మాత్రమే కాదు, మానవత్వానికే మచ్చగా మిగులుతుంది. మహారాష్ట్రలోని పుణెలో జరిగిన ఓ దారుణ ఘటన ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఇంకా మాటలు కూడా రాని తొమ్మిది నెలల చిన్నారి నోటిలో ఫెవిక్విక్ పోసిన ఘటన తీవ్ర ఆందోళనకు దారి తీసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఈ అమానుష ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటన పుణెలోని లోహేగావ్ ప్రాంతంలోని కల్వాడ్ వసతి ప్రాంతంలో జూలై 31న చోటుచేసుకుంది. ఈ ఘటనపై చిన్నారి తండ్రి అల్తాఫ్ నబీ షేక్ లోహేగావ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ప్రధాన నిందితురాలు సానియా షేక్‌తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఫిర్యాదుదారుడు అల్తాఫ్ షేక్ భార్య జైనబ్‌కు, ఆమె మరదలు సానియా షేక్‌కు కొంతకాలంగా కుటుంబ విషయాలపై తరచూ విభేదాలు జరుగుతున్నాయి. ఈ వివాదాన్ని మనసులో పెట్టుకున్న సానియా, ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతున్న తొమ్మిది నెలల చిన్నారిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చిన్నారి నోటిలో ఫెవిక్విక్ పోయడం ద్వారా తీవ్ర హాని కలిగించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన బయటకు తెలియకుండా ఉండేందుకు ఎవరికి చెప్పినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానంటూ సానియా బెదిరించినట్లు కూడా బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.
అంతేకాదు, ఈ వ్యవహారంలో మరో ఇద్దరు వ్యక్తులు కూడా అల్తాఫ్ షేక్‌ను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సానియాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఈ కేసులో బెదిరింపుల కోణాన్ని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటన తీవ్రతను గుర్తించిన చిన్నారి తల్లి వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. సమయానికి చికిత్స అందడంతో చిన్నారి ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. కుటుంబ కలహాలు ఎంత తీవ్రమైనవైనా, అమాయక చిన్నారిపై ప్రతీకారం తీర్చుకునే స్థాయికి వెళ్లడం సమాజాన్ని కలవరపెడుతోంది. నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోహేగావ్ పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతుండగా, సంఘటన వెనుక ఉన్న పూర్తి పరిస్థితులను పోలీసులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.
- Tags
- crime
- Maharashtra
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!