Rythu Bandhu: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. రాష్ట్ర రైతాంగానికి ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాలని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖామంత్రి హరీష్ రావును అదనపు ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అయితే ప్రభుత్వ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Read Also: RGV: పవన్ కు కథ చెప్తే.. అలాంటి సినిమాల్లో నటించను అన్నాడు
మరోవైపు డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాకు ముందస్తు చర్యల కోసం అధికారులతో చర్చించారు.