Jagadish Shettar: ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ను రాబోయే కర్ణాటక శాసన మండలి ఉప ఎన్నికల్లో అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది. జూన్ 30న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు షెట్టర్‌తో పాటు తిప్పన్నప్ప కమక్నూర్, ఎన్ఎస్ బోస్‌రాజులను కూడా కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రకటించింది.
Also Read: Fire: ఛత్తీస్‌గఢ్‌లోని షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు.. కిటికీలనుంచి దూకిన జనాలు
ముగ్గురు బీజేపీ నేతలు- లక్ష్మణ్ సవాది, బాబూరావ్ చియాంచన్‌సూర్, ఆర్ శంకర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో తమ పదవులకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, లింగాయత్ నాయకుడు జగదీష్ షెట్టర్ ఇదే కారణంతో బీజేపీని విడిచిపెట్టి కాంగ్రెస్‌లో చేరారు. హుబ్బళ్లి ధార్వాడ్ సెంట్రల్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
Also Read: Bihar: నితీష్ కుమార్‌కు షాక్.. సర్కారు నుంచి విడిపోతున్నట్లు జీతన్ మాంఝీ పార్టీ ప్రకటన
షెట్టర్ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటి నుంచి, 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు లింగాయత్ నాయకుడికి ఎలా స్థానం కల్పించాలనే దానిపై కాంగ్రెస్ ఆలోచిస్తోంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటు వేయనుండగా, అధికార పార్టీ కాంగ్రెస్ 135 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జూన్ 30న ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితాలు వెల్లడికానున్నాయి.