Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్‌గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ సూపర్‌స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. విజయ్ గతేడాది నటించిన ‘ది గోట్’ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ తమిళనాడు రీజియన్‌లో ఎలాగోలా బ్రేక్ ఈవెన్ సాధించగలిగింది. కానీ ‘జన నాయగన్’ మాత్రం అన్ని ఏరియాల్లోను డిస్ట్రిబ్యూటర్లను తీవ్రంగా నిరాశపరిచింది. నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు హిట్ చిత్రం ‘భగవంత్ కేసరి’ కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది.
అయితే ఒరిజినల్ వెర్షన్లో ఉన్న ప్రధానమైన సోల్‌ను దర్శకుడు సరిగ్గా డీల్ చేయలేదు. ఫస్టాఫ్ ను కాస్త బాగానే హ్యాండిల్ చేసాడని అనిపించినా సెకండాఫ్ పూర్తిగా చేతులెత్తేశాడు. దాంతో ఆడియెన్స్ తో పాటు ఫ్యాన్స్ నుండి కూడా డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 203 కోట్ల థియేటరికల్ బిజినెస్ తో రిలీజ్ అయిన జననాయగన్ కేవలం రూ. 135 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు 25 నుంచి 30 శాతం వరకు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. అటు థియేటర్ రన్ దాదాపు ముగింపు స్టేజ్ కు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా బాక్సాఫీస్ ఫలితం దారుణంగా ఉంది. తెలుగు థియేటరికల్ రైట్స్‌ను రూ. 14 కోట్లకు విక్రయించగా థియేటర్ల నుంచి వచ్చిన వసూళ్లు కేవలం రూ. 6 కోట్లకే పరిమితమయ్యాయి. విజయ్ చివరి సినిమాగా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద కోలుకోలేని డిజాస్టర్‌గా ముగిసింది. మన తెలుగు సినిమాను రీమేక్ చేసి దాన్ని డబ్బింగ్ చేసి తెలుగులో రిలీజ్ చేయడమే విడ్డూరం. అందుకు తగ్గట్టే కలెక్షన్స్ కూడా వచ్చాయి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
- Tags
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?