రైల్వే శాఖలో ఉన్న ఖాళీలరై కీలక విషయం తెలిసింది. రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 1.7 లక్షలకు పైగా భద్రత విభాగంలోనే ఉన్నాయని పేర్కొంది.
పథకాల ద్వారా రైతులకు లబ్ధి చేకూర్చేందుకు ఉద్దేశించిన మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా బుధవారం ఇక్కడ తెలిపారు.
సౌదీ అరేబియాలోని జెడ్డాలో యుఎస్ కాన్సులేట్ ముందు బుధవారం జరిగిన కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు, సాయుధుడు ఇద్దరూ మరణించారు. కాన్సులేట్ భవనం ముందు సాయుధుడైన వ్యక్తి కారులోంచి దిగి కాల్పులు జరిపాడని సౌదీ పోలీసు ప్రతినిధి తెలిపారు.
అస్సాంలో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరదలు సంభవించాయి. వివిధ ప్రాంతాలలో సాధారణ జనజీవనం స్తంభించిపోయింది. అంతేకాకుండా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారని రోజువారీ వరద నివేదిక ధృవీకరించింది.
ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రిగా టీఎస్ సింగ్ డియోను కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే బుధవారం నియమించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో త్వరలో జరగనున్న ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై చర్చించేందుకు జరిగిన సమీక్షా సమావేశంలో సింగ్ డియో నియామకాన్ని ప్రకటించారు.