Khammam: కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలతో ముస్తాబైన ఖమ్మం.. ప్రత్యేక ఆకర్షణగా హోర్డింగులు, భారీ కటౌట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khammam: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన జన గర్జన సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖమ్మం నగరం వైపే పరుగులు తీస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీనే భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు లక్షల మందితో జనగర్జన సభను విజయవంతం చేయాలని లక్ష్యంతో అన్ని సిద్ధం చేశారు.
Read Also: Mahabubabad: మద్యం మత్తులో వైద్య సిబ్బంది హల్ చల్.. తాగిన మైకంలో పోసేశాడు..!
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిధిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా.. కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. అంతేకాకుండా పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20X20 అడుగుల సర్కిల్ హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు.
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో.. కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భట్టి విక్రమార్క భరత వాక్యం పలికాడని రాజకీయ వర్గాల్లో ఇప్పటికే బలంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే… ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత.. కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్రమార్క తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యాడు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!