ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, ఆరోగ్యం క్షీణించిన లెక్కచేయకుండా భట్టి విక్రమార్క తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని నిర్విరామంగా 1360 కిలోమీటర్లు కొనసాగింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఖమ్మంలో ఆదివారం నిర్వహించే తెలంగాణ జన గర్జన లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, గురునాథ్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ లో చేరతారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి ప్రజాప్రస్థానం పాదయాత్రలో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను తెలుసుకొని అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ఉచిత కరెంటుపై చేసి రైతు సంక్షేమం. ” కోసం అనేక పథకాలు తీసుకువచ్చిన తరహాలోనే సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తన పాదయాత్రలో పోడు భూములు, ధరణి సమస్యలతో ఎదుర్కొంటున్న రైతులు ఇబ్బందులను నేరుగా తెలుసుకోవడంతో పాటు ఆ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో కూడా గట్టిగా చెప్పారు.
ఏఐసీసీ దిశా నిర్దేశంలో మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా, బోథ్ నియోజకవర్గం బజరహాత్నూర్ మండలం పిప్పిరి గ్రామంలో మొదలైన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర జూలై 2న ఖమ్మంకు చేరుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోసింది. ఏఐసీసీ అధ్యక్షులు ఖర్గే, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్ వేందర్ సింగ్ సుఖ్, తమిళనాడు సీఎల్పీ లీడర్ సెల్వా పేరుతుంగై, చతిస్గడ్ ఇన్చార్జి ఎంపీ రంజిత రంజన్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కాంగ్రెస్ శాసనసభ్యులు, టీపిసిసి నాయకులు ప్రతి పాదయాత్రలో పాల్గొని కదం తొక్కడం కాంగ్రెస్ శ్రేణులు సరికొత్త జోష్ను నింపింది.
తెలంగాణలోని 17 జిల్లాల్లోని బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, పెద్దపల్లి, హుజూరాబాద్, హుస్నాబాద్, వర్ధన్నపేట, వరంగల్ వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్, జనగామ, అలేరు, భువనగిరి, ఇబ్రహీం పట్నం, ఎల్బీనగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, చేవెళ్ల, షాద్ నగర్, పరిగి, జడ్చెర్ల, నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, దేవరకొండ, నాగార్జున సాగర్, నల్లగొండ, నకిరేకల్, సూర్యాపేట, కోదాడ, పాలేరు, ఖమ్మం నియోజకవర్గాల్లో పాదయాత్ర విజయవంతంగా పూర్తిచేసుకుని నేడు ఖమ్మంలో జరిగే తెలంగాణ గర్జన సభకు చేరుకున్నది.
సామాన్యుడిగా టెంట్ లోనే భట్టి
గాలి దుమారాలు.. విపరీత ఎండలు.. ఊహించని భారీ వర్షాలు.. అయినా కూడా తనతో నడిచే కార్యకర్తలతో సమానంగా టెంట్ లో ఉంటూ.. వారితో కలిసి తింటూ.. కలియ తిరుగారు భట్టి.
పాదయాత్రలో ముఖ్య ఘట్టాలు ఇవే
మార్చి 16న పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ను పిప్పిరి గ్రామంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రారంభించారు.
మార్చి 19న ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.
మార్చి 22న కెరిమెరి మండలం ఝరి గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 125 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది.
ఏప్రిల్ 14న మంచిర్యాల పట్టణంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సత్యాగ్రహ సభ కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభం తెచ్చేలా జరిగింది. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకాగా.. దాదాపు లక్ష మంది ప్రజలు ఈ సభలో స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం.
ఏప్రిల్ 16న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టువద్ద 300 కిలోమీటర్ల మైలు స్టోన్ ను తాకిన పీపుల్స్ మార్చ్..
మార్చి 29న జనగామ జిల్లా నర్మెట్టలో 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
మే 1న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలోని మఠాలు, సోమేశ్వరాలయం సందర్శన
మే 3న యాదాద్రి దేవాలయం, బస్వాపురం రిజర్వాయర్ ను సందర్శించారు.
మే 5న భువనగిరి నియోజకవర్గం మగ్దుంపల్లి గ్రామంలో 600 కిలోమీటర్లు,
చేవెళ్ల నియోజకవర్గం రామానుజాపూర్ లో 700 కిలోమీటర్ల పాదయాత్రను పీపుల్స్ మార్చ్ అందుకుంది.
మే 15న వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్టు వద్ద పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు చేస్తున్న నిర్లక్ష్యం పైన రిటైర్డ్ ఇంజనీర్లు సామాజిక ఉద్యమకారులతో సమావేశం.
జడ్చెర్ల నియోజకవర్గం కేశవరాంపల్లిలో 800 కిలోమీటర్లకు చేరుకోంది.
మే 23న ఉద్దండపూర్ ప్రాజెక్టు సందర్శన, భూ నిర్వాసితులతో సమావేశం.
మే 25న జడ్చెర్ల పట్టణంలో పీపుల్స్ మార్చ్ భారీ భహిరంగ సభ విజయవంతమైంది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మే 27న నాగర్ కర్నూలు జిల్లాలోని వట్టెం ప్రాజెక్టు సందర్శన భూ నిర్వాసితులతో సమావేశం.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న అచ్చంపేట నియోజకవర్గం, బలుమూరు మండలం కేంద్రంలో తెలంగాణ లక్ష్యాలు- సాధించిన ఫలితాలు అనే అంశంపై మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
జూన్ 3న అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ కు తమిళనాడు సీఎల్పీ లీడర్ సెల్వ పెరుతుంగై హాజరయ్యారు
జూన్ 6న అచ్చంపేట నియోజకవర్గం జోగ్యా తండా ఎస్ఎల్బిసి టన్నెల్ పరిశీలన.
జూన్ 8న దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండలంలోని నక్కల గండి ప్రాజెక్టు పరిశీలన
జూన్ 10న దేవరకొండ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్ కు చతిస్గడ్ పార్టీ ఇన్చార్జి, ఏఐసీసీ సెక్రెటరీ, రాజ్యసభ సభ్యురాలు రంజిత రాజన్ హాజరయ్యారు.
జూన్ 11న దేవరకొండ నియోజకవర్గం గుమ్మడవెల్లికి పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రవేశించడంతో.. వెయ్యి కిలోమీటర్లను మార్క్ ను చేరుకున్న సందర్భంగా పైలాన్ ఆవిష్కరణ చేశారు.
జూన్ 18 నల్లగొండ జిల్లా పానగల్ లోని సోమేశ్వర నాథుడి దర్శనం
పాదయాత్ర ప్రారంభించి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 23న
నకిరేకల్ నియోజకవర్గం ఉప్పలపాడు గ్రామంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి, సంబానీ చంద్రశేఖర్ లు కేక్ కట్ చేశారు.
జూన్ 30న పాలేరు నియోజకవర్గం పొన్నెకల్లు గ్రామంలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పైలాన్ ను ప్రజా యుద్ధనౌక గద్దర్, బీసీసీ మాజీ అధ్యక్షులు విహెచ్ హనుమంతరావులు ఆవిష్కరించారు.
జూలై 1న ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరుకున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర.