GST Collections: దేశంలో మరోసారి వస్తు, సేవల పన్ను వసూళ్లు భారీగా నమోదయ్యాయి. జూన్ నెలకు గానూ రూ.1,61,497 కోట్లు వసూళ్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ రూపంలో రూ.31,013 కోట్లు, ఎస్‌జీఎస్టీ కింద రూ.38,292 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.80,292 కోట్లు చొప్పున వసూలైనట్లు తెలిపింది.
Read Also: Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్..
గతేడాది జూన్‌లో రూ.1.44 లక్షల కోట్లు వసూళ్లు నమోదవ్వగా.. ఈ ఏడాది వసూళ్లు 12 శాతం మేర పెరిగాయి. అలాగే, జీఎస్టీ వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు మార్కు దాటడం ఇది నాలుగోసారి. 2021-22లో తొలి త్రైమాసికంలో జీఎస్టీ సగటు వసూళ్లు రూ.1.10 లక్షల కోట్లు ఉండగా.. 2022-23 తొలి త్రైమాసికానికి రూ.1.51 లక్షల కోట్లకు, 2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.1.69 లక్షల కోట్లకు పెరిగినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
Read Also: Guinness World Records : ఒంటిపై మంటలతో పరుగెత్తిన రియల్ హీరో.. హ్యాట్సాప్ బాసూ..
ఇక తెలుగు రాష్ట్రాల జీఎస్టీ వసూళ్ల విషయానికొస్తే.. తెలంగాణలో రూ.4,681.39 కోట్ల మేర వసూళ్లు జరిగాయి. గతేడాది రూ.3,901.45 కోట్లతో పోలిస్తే 20 శాతం మేర పెరిగాయి. గతేడాది ఏపీలో రూ.2,986.52 కోట్లు వసూళ్లు నమోదవగా.. ఈ ఏడాది జూన్‌లో రూ.3,477.42 కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 16 శాతం వృద్ధి నమోదైంది. ఎప్పటిలానే మహారాష్ట్ర రూ.26,098.78 కోట్ల (17 శాతం) వసూళ్లతో అగ్రస్థానంలో నిలిచింది.