Watermelon: వేడిని నివారించడానికి మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవడం అవసరం. దీని కోసం మన శరీరానికి తగినంత నీరు అవసరం ఉంటుంది. అయితే నీరు కాకుండా.. హైడ్రేట్ గా ఉండేందుకు చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి. వాటిని తినడం ద్వారా మన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. పండ్లలో అయితే.. పుచ్చకాయల్లో ఎక్కువ మొత్తంలో నీరు కనిపిస్తుంది.
Read Also: Manipur CM: అందుకే రాజీనామా చేయాలనుకున్నా.. ఆ తర్వాత నిర్ణయం మార్చుకున్న..
పుచ్చకాయలో దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. వేసవిలో మామిడి తర్వాత ఎక్కువగా పుచ్చకాయను తింటుంటారు. పుచ్చకాయల్లో ఆమ్లాజనకాలు మరియు పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పుచ్చకాయను తిన్న తర్వాత నీళ్లు తాగకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది ఆరోగ్య పరంగా అస్సలు మంచిది కాదని.. జీర్ణశయాంతర ప్రేగులపై ప్రభావం చూపుతుందని తెలుపుతున్నారు. పుచ్చకాయలో నీరు, చక్కెర మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి. దానివల్ల సూక్ష్మజీవులు మరియు బ్యాక్టీరియా పెరగడానికి నీరు మరియు చక్కెర అవసరమని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పుచ్చకాయ తిన్న తర్వాత నీళ్లు తాగితే జీర్ణకోశంలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
Read Also: ICC World Cup Qualifier: వెస్టిండీస్‌కి ఘోర అవమానం.. పసికూన దెబ్బకు వరల్డ్‌కప్ నుంచి ఔట్
పుచ్చకాయ తిన్న తర్వాత ఎంత సేపటికి నీరు తాగాలి అనేదానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువగా ఉండటం వల్ల తిన్న వెంటనే దాహం వేయదని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తిన్న గంట తర్వాత తాగవచ్చు. పుచ్చకాయ తిన్న తర్వాత ఎక్కువ నీరు తీసుకోవడం వల్ల విరేచనాలు లేదా వాంతులు అవుతాయని అంటున్నారు.