యూనిఫాం సివిల్ కోడ్ అమలుపై కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ శనివారం నాడు కేంద్రాన్ని హెచ్చరించారు. ఇది అన్ని మతాలపై ప్రభావం చూపుతుందని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ను అమలు చేయడం ఆర్టికల్ 370 ని రద్దు చేసినంత సులభం కాదని కూడా అన్నారు.
కింగ్ కోబ్రా ఒక ఇంటి వెలుపల నేలపై ఉండగా.. ఓ వ్యక్తి పాము తలపై నీటిని పోస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పాము కూడా అలా నీళ్లు పోస్తుంటే.. సరదాగా స్నానం చేస్తోంది. మాములుగా అయితే పామును చూసి పారిపోయే జనాలు ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాము తలపై నీళ్లు పోస్తూ భయపడకుండా అలానే ఉన్నాడు.
పశ్చిమ బెంగాల్లోని సౌత్ 24 పరగణాస్ జిల్లాలో శనివారం జరిగిన ముడిబాంబు పేలుడులో ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. ఆ పిల్లలు దానిని బంతి అని తప్పుగా భావించి ముడిబాంబును రోడ్డు పక్కన నుంచి తీయడంతో ఈ పేలుడు జరిగింది.
ఐరోపా దేశమైన స్పెయిన్ను వరదలు అతలాకుతలం చేస్తు్న్నాయి. తీవ్రమైన తుఫాను ప్రభావంతో కుండపోత వర్షాల వల్ల జరాగోజా నగరంలో వరద బీభత్సం నెలకొంది. భారీ వర్షం కారణంగా అనేక వీధులు జలమయమయ్యాయి.
మెక్సికోలో దారుణం జరిగింది. అల్వారో అనే వ్యక్తి తన భార్యను చంపిన తర్వాత ఆమె మెదడును టాకోస్ అనే మెక్సికో ఆహారంతో కలిపి తిన్నాడనే ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ చేయబడ్డాడు. 38 ఏళ్ల అతడిని జులై 2న ప్యూబ్లోలోని అతని ఇంటి నుంచి అరెస్టు చేసినట్లు ది మిర్రర్ నివేదించింది.
బెంగాల్లోని వివిధ ప్రాంతాల్లో రాళ్లు రువ్వడం, దహనం చేయడంతో పాటు దోపిడీ ఘటనలు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలోని పలు చోట్ల హింసాత్మక ఘటనల్లో 14 మంది మృతి చెందినట్లు సమాచారం.