* ప్రకాశం: దోర్నాల మండలం యడవల్లిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి ఆదిమూలపు సురేష్
* ప్రకాశం: గిద్దలూరులో పవన్ కళ్యాణ్ వాలంటీర్లలను ఉద్దేశించి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన కార్యక్రమం
* గుంటూరు: వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో వాలంటీర్ల నిరసన.. చెరుకుపల్లి, రేపల్లె ప్రాంతాల్లో ధర్నా నిర్వహించనున్న వాలంటీర్లు
* నెల్లూరు జిల్లా: నేడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రెండో రోజు కొనసాగుతున్న అంగన్‌వాడీల 36 గంటల మహాధర్నా
* తిరుపతి: నేడు తిరుపతిలో కేరళ, అసోం గవర్నర్‌ల పర్యటన
* ఏలూరు: నేడు దెందులూరు, ఉంగుటూరు ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్
* పార్వతీపురం మన్యం జిల్లా: నేడు శంబర పొలమాంబ అమ్మవారికి శాకాంబిరి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో వీ.రాధాకృష్ణ వెల్లడి
* విశాఖ: నేడు సింహాచలం దేవస్థానంలో మధ్యాహ్నం వరకే దర్శనాలు.. రేపు ఉదయం సుప్రభాత సేవతో దర్శనాలు ప్రారంభం
* అమరావతి: ఇవాళ ఎస్ఐపీబీ సమావేశం.. సీఎం జగన్ అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశం.. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ.. పలు పరిశ్రమల ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునే అవకాశం.. జీఐఎస్‌లో ఎంఓయూల గ్రౌండింగ్ దిశగా చర్చలు
* నేడు సుప్రీంకోర్టులో ఏపీ రాజధాని కేసు విచారణ.. అమరావతి రాజధాని వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను విచారణ చేయనున్న సుప్రీంకోర్టు