తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే.. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో 19 మంది అరెస్ట్ చేశారు సిట్ పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే 74 మందిని అరెస్టు చేసిన సిట్ పోలీసులు.. నిందితులు విచారణలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇప్పుడు మరో 19 మంది అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఈ కేసులో త్వరలో మరి కొంత మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : Pothula Sunitha Strong Warning: పవన్‌కు ఇదే మా వార్నింగ్.. మేం చాటలు, చెXX. ఎత్తితే నీ గతేంటి..?
అందుకోసం సిట్ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే… టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్ చేయించి అరెస్ట్ అయిన పోల రమేష్ కు నిందితులకు సంబంధాలు సమాచారం. అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ ను 30 మందికి విక్రయించిన పోల రమేష్ వద్ద నుంచి సేకరించిన సమాచారంతో పేపర్ కొనుగోలు చేసిన నిందితులను అరెస్టు చేస్తూ వస్తున్నారు సిట్ అధికారులు.
Also Read : Puvvada Ajay Kumar : కొంతమంది సన్నాసులు ఏవేవో మాట్లాడుతున్నారు
ఇదిలా ఉంటే.. ఇటీవల.. మున్సిపల్ ఏఈ పరీక్షలో 16వ ర్యాంకు సాధించిన నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నాగరాజు.. ప్రభుత్వ ఉద్యోగి రమేష్ నుంచి పేపర్ కొనుగోలు చేసి పరీక్ష రాసి ర్యాంకు సాధించినట్లు గుర్తించారు.