Supreme Court: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఆగస్టు 2 నుంచి సుప్రీంకోర్టు విచారించనుంది. సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో సోమ, శుక్రవారాలు మినహా మిగిలిన రోజుల్లో పిటిషన్లపై విచారణ ఉంటుంది. వాటిని నేడు పరిశీలించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. ఆగస్టు 2 నుంచి పూర్తిస్థాయి విచారణను చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ-కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించిన విషయం తెలిసిందే. రద్దును సవాల్ చేస్తూ పిటిషనర్లుగా ఉపసంహరించుకునేందుకు ఐఏఎస్ అధికారి షా ఫైసల్, మాజీ విద్యార్థి కార్యకర్త షెహ్లా రషీద్‌లను కూడా సుప్రీంకోర్టు అనుమతించింది.
Also Read: Kim Yo Jong: ఉత్తర కొరియా గగనతలంలోకి అమెరికా గూఢచారి విమానం.. కిమ్ సోదరి వార్నింగ్!
ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5న తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సమర్ధించుకుంది. అది ముమ్మాటికీ సరైన నిర్ణయమే అని పేర్కొంటూ సుప్రీంకోర్టుకు సోమవారం 20 పేజీల అఫిడవిట్‌ను సమర్పించిన సంగతి తెలిసిందే. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత మూడు దశాబ్దాల గందరగోళం తర్వాత జనజీవనం సాధారణ స్థితికి వచ్చిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. గత మూడేళ్లుగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఎలాంటి సమ్మె లేకుండా పనిచేస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఉగ్రవాదులు , వేర్పాటువాద నెట్‌వర్క్‌లు నిర్వహిస్తున్న వీధుల్లో హింస తగ్గుముఖం పట్టిందని వివరించింది. 20 పేజీల అఫిడవిట్‌లో ఈ ప్రాంతంలో శాంతి, అభివృద్ధిని ప్రోత్సహించడానికి తీసుకున్న వివిధ చర్యలను కేంద్రం వివరించింది. ఈ చారిత్రాత్మక అడుగు ఈ ప్రాంతంలో స్థిరత్వం, శాంతి, అభివృద్ధి, భద్రతను తీసుకువచ్చిందని పేర్కొంది. దృఢమైన ఉగ్రవాద వ్యతిరేక చర్యలు తీవ్రవాద పర్యావరణ వ్యవస్థను కూల్చివేయడానికి దారితీశాయని, దీని ఫలితంగా 2018లో 199 నుంచి 2023లో 12కి టెర్రరిస్ట్ రిక్రూట్‌మెంట్ గణనీయంగా తగ్గిందని అఫిడవిట్ హైలైట్ చేసింది. కేంద్రం చర్యను సమర్థిస్తూ, అఫిడవిట్‌లో..ఈ ప్రాంతంలోని నివాసితులందరూ దేశంలోని ఇతర ప్రాంతాలలో పౌరులకు అందుబాటులో ఉన్న హక్కులను అనుభవిస్తున్నారని పేర్కొంది.