వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు జరిపిన తీరు అత్యంత దారుణమని సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. దర్యాప్తు సంస్థల చరిత్రలోనే వివేకా కేసు మచ్చుతునక అని అన్నారు.
వర్గీకరణ కోసం పోరాటం చేసిన సమయంలో పెట్టిన కేసులను ఎత్తేయాలని సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి ఆదిమూలపు తెలిపారు. మందకృష్ణ మాదిగతో పాటు మాదిగలందరి పైనా పెట్టిన కేసులు ఎత్తేయాలని వినతిపత్రం ఇచ్చామని ఆయన పేర్కొన్నారు.
విదేశీ యూనివర్శిటీలతో పాటు దేశీయ ప్రతిష్టాత్మక సంస్థల్లో బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో వెనుకబడిన వర్గాల ఫీజులు ప్రభుత్వం తెలంగాణ చెల్లిస్తుందని ఆయన తెలిపారు. breaking news, latest news, telugu news, gangula kamalakar, cm kcr,
తెలంగాణ రాష్ట్రంలో నాన్ క్యాడర్ ఎస్పీలు బదిలీలు అయ్యారు. 15 మంది నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణలో సుమారు 50 లక్షల మందికి పైగా మహిళలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేణుకా చౌదరి. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అభయహస్తం, బంగారు తల్లి పథకాలు ఎక్కడికి వెళ్ళాయని, దాదాపు 5 లక్షల డ్వాక్రా గ్రూపులను సైతం కేసీఆర్ మోసం చేశారన్నారు. డ్వాక్రా రుణాలు కట్టాలని మహిళలను ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిందని, పాల్వంచలో కెటిపీఎస్ ను కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి చేశామని ఆమె మండిపడ్డారు. Breaking…