మొరంచపల్లి గ్రామం ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది ఏ ఇంటిని కదిలించిన ఒక కన్నీటి గాదె వినిపిస్తున్నారు ..సుమారు 12 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవన సాగించి గ్రామస్తులు నీటి ఉధృతి తగ్గిన తర్వాత తమ ఇంటి పరిస్థితులు చూసుకొని కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్నారు. ఆప్తులను కోల్పోయిన వాళ్లు మేము ఎందుకు బ్రతికున్నామంటూ ఏడుస్తున్నరు. భూపలపల్లి జిల్లా గణపురం మండలంలోని మోరంచపల్లి జల దిగ్బంధంలో చిక్కుకుంది. మోరాంచ వాగు లోకి 5 గ్రామాల చెరువుల నీరు చేరడంతో మోరాంచ వాగు పొంగిపొర్లి మొరచపాపల్లి గ్రామాన్ని ముచేసింది. బుధవారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో పొంగిన మోరాంచ వాగు. గురువారం తెల్లవారు జామున 4 గంటలకు మోరాంచ పల్లి. కుందయ్యా పల్లి లోకి నీరు చేరింది. మోరాంచ పల్లిని మొత్తము ముంచేసింది ఉదయం 4 గంట లనుండి ప్రారంభం అయిన వరద ఉదృతి కేవలం 20 నిమిషాల్లోనే ఇండ్లలోకి నడుము లోతు నీరు చేరింది. నిద్రలో ఉన్న జనం తేరుకునే లోపే ఇండ్లలోకి 6 ఫీట్ల నీరు చేరడంతో. 250 కుటుంబాలు నీటిలో చిక్కుకున్నారు. రేకుల ఇండ్లలో ఉన్న వర్లు గోడలని పట్టుకొని ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే. బిల్డింగ్ ఉన్న వాళ్ళు స్లాబ్ ల పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు ఈ క్రమంలో నలుగురు గల్లంతయ్యారు
గ్రామస్తులు వరదల్లో చిక్కుకోవడంతో ఎన్డీఆర్ ఎఫ్, కేంద్ర ప్రత్యేక బలగాలు రక్షించాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత గ్రామానికి సమీపంలోని మోరంచవాగు వరద దీంతో గ్రామస్తులు వరదల్లో చిక్కుకున్నారు. సుమారు 600 వందల మందికి పైగా వరదల్లో ఉండిపోవడంతో రంగం లోకి దిగిన అధికారులు వారిని సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లి యత్నాలు చేశారు .. మోరాంచపలి గ్రామంలోకి వెళ్లే దారి లేక మధ్యాహ్నం 12 గంటలకు రంగంలోకి దిగి రెండు ఆర్మీ హెలీకాప్టర్ల. 50 మంది ndrf సిబ్బంది సహకారంతో 600 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
మోరాంచ వాగు ఉధృతి తగ్గడంతో మోరాంచపల్లి గ్రామంలో జరిగిన వరద ఉధృతి ని పరిశీలించేందుకు గ్రామంలోకి వచ్చిన అధికారులు పరిస్థితి చూసి షాక్ అయ్యారు. గ్రామం గ్రామ మొత్తం కన్నీటి పర్వంలోనే ఉండి పోయింది. మొన్నటి పరిస్థితికి ప్రాణాలు దక్కితే చాలు అనుకున్న గ్రామస్థులు ఇప్పుడు మేము ఎందుకు బతికి ఉన్నామా అని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోలిపోయిన తీరు తో కన్నీరు మున్నీరుగా విలపిస్తునాన్నారు. తమ ఆప్తులను ప్రాణాలతో కాపాడుకోలేనందుకు కొందరు ఆర్తనాదాలు చేస్తున్నారు. తమ జీవనాధారం అయిన పశువులు కోల్పోయిన వారి బాధ వర్ణనాతీతం.
మోరాంచ పల్లి గ్రామాన్ని ముంచేసిన వరద ఉధృతికి సుమారు 40 కోట్ల మేర నష్టం జరిగింది అని అంచనా వేస్తునాన్నారు. ప్రతి ఇంట్లో కనీసం 2 నుండి 6 పశువుల ఉన్నాయి వ్యవసాయ సాగుకోసం ఎరువును తెచ్చిపెట్టుకున్నారు. కుటుంబానికి ఏడాది పాటు సరిపడా బియ్యాన్ని .. వంట సామగ్రి బట్టలు సర్టిఫికెట్ల.. భూమి పత్రలు ఇంట్లో దాచుకున్న డబ్బులు ఇలా ఒకటేమిటి సర్వం కోల్పోయారు
మోరాంచ పల్లి లో 159 పశువులు వరద తాకిడికి మృత్యువ్యాత పడ్డాయి. మరో 600 పశువులు గల్లంతయ్యాయి. 10 కార్లు కొట్టుకొని పోయాయి. 10.లారీలు 10 టాటా ఏసీ.. 15 ట్రాక్టర్ 70 బైక్ లు నీట మునిగాయి. కొన్ని కొట్టుకొని పోయాయి.
మోరాంచ పల్లి గ్రామానికి జిల్లా కలెక్టర్. భూపాలపల్లి ఎమ్మెల్యే వచ్చి ఆదుకుంటాం ఆని హామీ ఇచ్చారు. వరద భయం నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటునం గ్రామస్థులకు కొంత మానసిక ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు అయితేవ్యవసాయంపై ఆధారపడి జీవనసాగించే మోరాంచపల్లి సాధారణ స్థితికి రావడానికి మరో వారం పది రోజులు పెట్టె అవకాశం ఉంది.