ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు ఉండే మూడు నెలలు అయినా హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోవాలని రానున్న రోజుల్లో హైదరాబాద్ నగర అభివృద్ధికి బిజెపి కట్టుబడి ఉందని కనీస సౌకర్యాలు కల్పించ లేనటువంటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. అంబర్‌పేట పటేల్ నగర్ నుండి ముసారంబాగ్ బ్రిడ్జ్ వరకు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరవాసులకు కనీస సౌకర్యాలు కల్పించలేనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత మున్సిపల్ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని కిషన్ రెడ్డి తెలిపారు.
Also Read : High Court : రేవంత్‌కు వివరాలివ్వడానికి అభ్యంతరం ఏంటి..?
తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ వరదలతో ఇబ్బంది పడుతున్నారని, గత కొన్ని సంవత్సరాలుగా చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ దగ్గర ప్రజలు ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరం చేస్తామని ఇస్తాంబుల్‌గా మారుస్తామని డల్లాస్ చేస్తామని వాషింగ్టన్ చేస్తామని అనేక రకాల ప్రకటనలు చేసినప్పటికీ కింది స్థాయిలో ఏ రకమైన మార్పు లేదని అన్నారు. ట్యాంక్ బండ్లో మురికి నీరు తీసేసి కొబ్బరి నీళ్ళు నింపుతానని చెప్పిన హామీ నుంచి మొదలుకొని మంచినీటి సమస్య ఓట్ల సమస్య వీధి దీపాలనుండి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేనటువంటి అన్ని సమస్యలు హైదరాబాద్ నగరంలో ఉన్నాయి.. తెలంగాణ ప్రభుత్వం ఎంతసేపు హైటెక్ సిటీలో కొండాపూర్ లో మాదాపూర్ లో ఫ్లైఓవర్లు స్కై ఓవర్లు రకరకాల రంగులు పూసి అభివృద్ధి చేస్తున్నామని చెప్పడం తప్ప హైదరాబాద్లో పేద మధ్యతరగతి ప్రజలు నివసించే పాత బస్తీ వాసులపై ప్రభుత్వం కుట్రపూరితంగా కక్షగట్టి నట్లు వ్యవహరిస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు..
Also Read : Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!