వర్షాకాలంలో మీ జుట్టు విపరీతంగా రాలుతుందా. మీరు చేసే కొన్ని పొరపాట్ల వల్ల జుట్టు ఎక్కువ డ్యామేజ్ అయి జుట్టు ఊడిపోతుంది. వర్షాకాలంలో పెరిగిన తేమ ప్రభావం తల మీద పడి జుట్టు బాగా రాలుతుంది. అంతే కాకుండా వర్షాకాలంలో జుట్టు గరుకుగా, జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. జుట్టు సంరక్షణ చిట్కాలను తప్పకుండా పాటించాలి. లేదంటే జుట్టు బాగా రాలుతుంది. వర్షాకాలంలో జుట్టు రాలకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వర్షాకాలంలో జుట్టుకు సంబంధించిన కొన్ని తప్పులు చేయకూడదు. అవేంటో తెలుసుకుందాం..
Bhuvneshwar Kumar: అయోమయంలో భువీ ఫ్యాన్స్.. టీమిండియా జట్టులో స్థానంలో లేనట్టేనా..?
క్రమం తప్పకుండా తల స్నానం చేయడం
సాధారణంగా కొంతమంది ఆడవారు ప్రతిరోజూ తలస్నానం చేస్తుంటారు. వర్షాకాలంలో జుట్టు చాలా త్వరగా జిడ్డుగా, గరుకుగా మారుతుందని తలస్నానం చేస్తారు. కానీ రోజూ తలస్నానం అస్సలు మంచిది కాదు. అలా చేయడం వల్ల జుట్టు మరింత డ్యామేజ్ అవుతుంది. నెత్తిమీద ఉండే నేచురల్ ఆయిల్ తగ్గిపోతుంది. దీని వల్ల జుట్టు మరింత ఫిజీగా మారుతుంది. నెత్తి జిడ్డుగా ఉన్నట్లైతే వారానికి 3 సార్లు తలస్నానం చేయండి. సాధారణంగా ఉంటే వారానికి 2 సార్లు తలస్నానం చేస్తే మంచిది. తల స్నానం చేసేటప్పుడు సల్ఫేట్ లేని మైల్డ్ షాంపూను ఉపయోగించండి.
వర్షంలో తడిసిన వెంటనే తలస్నానం
వర్షాకాలంలో ఎప్పుడైనా, ఎక్కడైనా వర్షం కురుస్తుంది. దీంతో మీ జుట్టు తడుస్తుంది. అందుకే మీరు బయటకు వెళ్లే ముందు గొడుగును తప్పకుండా తీసుకెళ్లండి. కానీ కొన్నిసార్లు జుట్టు తడుస్తుంది. వెంటనే మీ జుట్టును తేలికపాటి షాంపూతో బాగా కడగండి. లేదంటే నెత్తిమీద జిడ్డు, దురద, చుండ్రుతో పాటు జుట్టు రాలే సమస్య పెరుగుతుంది.
Bro Movie: పవన్ ఫాన్స్ అత్యుత్సాహం.. స్క్రీన్‌పై పాలాభిషేకం చేసి చింపారు!
ఆయిల్ పెట్టుకోవాలి
వర్షాకాలంలో మీ జుట్టు జిడ్డుగా ఉన్నా ఖచ్చితంగా నూనె పెట్టుకోవాలి. షాంపూ చేసే ముందు కూడా జుట్టుకు నూనెను రాయండి. ఎందుకంటే ఇది మీ నెత్తిమీద రక్త ప్రసరణను పెంచుతుంది. అంతేకాకుండా జుట్టుకు అవసరమైన పోషణను అందిస్తుంది. దాంతోపాటు వర్షాకాలంలో వచ్చే జుట్టు సమస్యలను తగ్గిస్తుంది. సాధారణంగా మనం రాత్రంతా నూనె పెట్టి ఉదయం తలస్నానం చేస్తాం. కానీ వర్షాకాలంలో తలస్నానం చేయడానికి 2 గంటల ముందు నూనెను రాయండి. అలా చేస్తే జుట్టుకు పోషణను అందిస్తుంది. జుట్టు జిడ్డుగా కనిపించే అవకాశం కూడా ఉండదు.
కండిషనర్ను స్కిప్ చేయడం
వానాకాలంలో తేమ కారణంగా జుట్టు చిక్కులు పడుతుంటాయి. దాని వల్ల దువ్వడం కష్టమవుతుంది. అందుకే తలస్నానం చేసిన వెంటనే కండీషనర్ అప్లై చేయాలి. అంతేకాకుండా జుట్టు చివర కండీషనర్ ను బాగా పెట్టండి. ఎందుకంటే ఈ సమయంలో జుట్టు దిగువ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుంది. కండీషనర్ మీ జుట్టును మృదువుగా చేయడమే కాకుండా చిక్కులు పడకుండా కూడా చేస్తుంది. దాతో జుట్టు షైనీ ఉంటుంది. వర్షం వల్ల జుట్టు దెబ్బతినకుండా రక్షిస్తుంది.
Viral Video: ఇన్‌స్టాగ్రామ్ రీల్‌కు పోజులిస్తుండగా జలపాతంలో జారిపడ్డాడు.. వీడియో వైరల్
హీట్ స్టైలింగ్
మీ జుట్టుకు హీట్ స్టైలింగ్ అస్సలు మంచిది కాదు. జుట్టు ఇప్పటికే గరుకుగా ఉంటే ఇది వర్షాకాలంలో జుట్టును మరింత దెబ్బతీస్తుంది. దాంతో జుట్టు మరింత బలహీనంగా మారుతుంది. ముఖ్యంగా కీస్ట్రైటర్, డ్రయ్యర్, కర్లింగ్ వంటి హీట్ స్టైలింగ్ సాధనాలను ఉపయోగించడం మంచిది కాదు. వీటిని వాడటం వల్ల మీ జుట్టు నిర్జీవంగా, పొడిగా మారుతుంది. అందుకే మీ జుట్టును సహజంగా ఆరనివ్వండి.