ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జాతీయ చేనేత దినోత్సవంలో భాగంగా కరీంనగర్ జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత వారోత్సవాలకు ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. breaking news, latest news, telugu news, padi kaushik reddy, brs, bjp
ప్రజల వద్దకు పాల్ అని తిరుగుతున్నా అని కేఏ పాల్ అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిరంజీవి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నదమ్ములు చిరంజీవి, పవన్ లు మాట్లాడుకుని విలీనం గురించి.. అల్లు అరవింద్ మధ్యవర్తిగా జనసేనను అమ్మకానికి పెట్టారంటూ పాల్ తెలిపారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.
అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.
మదనపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డులో టమాట ధరలు భారీగా తగ్గాయి. గ్రేడ్ ‘ఏ’ టమాటాలు కిలో రూ. 50 నుంచి రూ. 64 వరకు పలికింది. గ్రేడ్ ‘బి’ రూ. 36 నుంచి రూ. 48 వరకు పలికింది.