Delhi: పశ్చిమ ఢిల్లీలోని ఇందర్‌పురి ప్రాంతంలో దారుణం జరిగింది. 11 ఏళ్ల బాలుడిని ఓ మహిళ గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ బాలుడి నివాసంలోని బెడ్‌బాక్స్‌లో మృతదేహం లభ్యమైంది. బాలుడి మెడపై గొంతు నులిమి చంపిన గుర్తులు ఉన్నాయి. గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో బీఎల్‌కే ఆస్పత్రి నుంచి వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు బాలుడి తల్లి వాంగ్మూలాన్ని నమోదు చేసి హత్య కేసు నమోదు చేశారు.
Also Read: Himachal Pradesh: విరిగిపడిన కొండచరియలు.. ఆరుగురు పోలీసులు సహా 7 మంది మృతి
గురువారం సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి బయటి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించామని మృతురాలి తల్లి నీలు పోలీసులకు తెలిపారు. బాలుడు నడక కోసం బయటకు వెళ్లాడని ఆమె మొదట భావించింది. అయితే అతను క్లాస్‌కు రాకపోవడంపై అతని డ్యాన్స్ టీచర్ నుంచి వెంటనే కాల్ వచ్చింది. నీలు, ఆమె భర్త జితేంద్ర విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. విడివిడిగా నివసిస్తున్నారు. కొడుకు కనిపించకుండా పోయినప్పుడు నీలు జితేంద్రకు ఫోన్ చేసింది, అయితే ఒక మహిళ కాల్ ఆన్సర్ చేసింది. ఆ ఫోన్‌లో ఒకరికి అత్యంత ఇష్టమైన ఆస్తిని తీసివేయడం ఎలా అని ఆ మహిళ ప్రశ్నించిందని నీలు తెలిపింది. ఈ సంభాషణతో తాను ఉలిక్కిపడ్డానని ఆమె పోలీసులకు తెలిపింది. ఇంట్లో వెతకగా బెడ్‌బాక్స్‌లో బిడ్డ మృతదేహాన్ని దాచిపెట్టినట్లు నీలు చెప్పారు. తన పొరుగువారి సహాయంతో, ఆమె అపస్మారక స్థితిలో ఉన్న పిల్లవాడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించింది. అక్కడ ఆ బాలుడు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.
Also Read: University Student Death: ర్యాగింగ్ భూతానికి మరో విద్యార్థి బలి.. జాదవ్‌పుర్ యూనివర్సిటీలో ఘటన
నిందితురాలిని గుర్తించామని, ఆమెను పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశామని, ఆమె రహస్య స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, నిందితురాలు చనిపోయిన బాలుడి కుటుంబానికి తెలుసు, గతంలో వారి ఇంటికి కూడా వెళ్లింది. అయితే కొన్ని విషయాల్లో వీరి మధ్య వాగ్వాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గురువారం బాలుడి తల్లి లేని సమయంలో నిందితురాలు ఇంటికి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.