ఈరోజు హైద్రాబాద్ లో TSMIDC కార్యాలయంలో ఆవరణ లో ఆరోగ్య శాఖ కు సంబంధించిన ఒక యూనియన్ కార్యాలయం ప్రారంభోత్సవానికి డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. జైలర్ సినిమాలో సూపర్ స్టార్ డైలాగ్ వినిపించి ఆరోగ్య శాఖ సిబ్బందిని ఉత్సాహ పరిచారు. మొరగని కుక్క లేదు.. విమర్శించని నోరు లేదు. ఈ రెండు లేని ఊరు లేదు అని ఆయన అన్నారు. మన పని మనం చేసుకుని పోతుండాలి… అని ఆరోగ్య శాఖ సిబ్బందికి చెబుతూ.. సీఎం కేసీఆర్ తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు… కానీ ఏవి పట్టించుకోకుండా తన లక్ష్యాన్ని చేరుకుని 60 చిరకాల కోరిక నీ తీర్చారు అన్నారు. ఎంతోమంది అమరవీరుల బలిదానాల అనంతరం తెలంగాణ సాధించుకొగలిగామని ఆయన అన్నారు. కాబట్టి అన్ని సర్దుకుంటాయి… ఓపిక అవసరం అంటూ ప్రసంగించారు డీహెచ్ శ్రీనివాస్ రావు.
Also Read : Men Thrash Father: పిల్లాడు ఏడుస్తున్నా కనికరించ లేదు.. కర్రలతో దారుణంగా కొట్టారు
కేసీఆర్ బాటలో ప్రతి ఒక్కరూ ప్రయాణం చేయాలని పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణలో భాగంగా అందరూ కేసీఆర్‌తో అడుగులు వేయాలన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల పాలన లో డెవలప్ మెంట్‌తో పాటు ఎన్నో స్కీమ్‌లు ప్రవేశపెట్టారన్నారు. బంగారు తెలంగాణ చివరి దశలో ఉన్నదని, దాన్ని విజయవంతంగా పూర్తి చేయాలంటే మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని కోరారు. పిల్లల భవిష్యత్ నాశనం కాకూడదంటే సీఎంగా కేసీఆర్ మాత్రమే ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. స్వరాష్ట్రంలో ప్రజలంతా ఆత్మగౌరవంతో బతుకుతున్నారని కొనియాడారు. ప్రగతి, అభివృద్ధి లు పరుగులు పెడుతున్నాయన్నారు. దీన్ని అందరం కాపాడుకోవడానికి కంకణం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. రాష్ట్రం సల్లగా ఉండాలంటే కేసీఆర్‌కు అండగా నిలవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆయనకు గొప్ప విజనరీ ఉన్నదని, అది ఇప్పుడున్న రాజకీయ నాయకులకెవ్వరికీ లేదన్నారు. వంద ఏళ్ల లోపు కేసీఆర్ లాంటి నాయకుడు పుట్టడని జోస్యం చెప్పారు.
Also Read : Emergency in Ecuador: అధ్యక్ష అభ్యర్థి హత్య.. ఈక్వెడార్‌లో 2 నెలల పాటు అత్యవసర పరిస్థితి