తన ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానం తీర్పు పై కృష్ణామోహన్ రెడ్డి స్పందిస్తూ.. సుప్రీంకోర్టుకు వెళ్తానన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో ఉద్దేశ్వపూర్వకంగా ఎటువంటి సమాచారం దాచిపెట్టలేదని ఆయన పేర్కొన్నారు. డీకే అరుణ కోర్టును తప్పుదోవ పట్టించారని కృష్ణామోహన్ రెడ్డి తెలిపారు. న్యాయ వ్యవస్థ పై నమ్మకం ఉందని.. తప్పుడు అఫిడవిట్ చూపించి తన పైన అనర్హత వేటు అంటూ ప్రచారం చేశారని కృష్ణామోహన్ రెడ్డి చెప్పారు.
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ మాకు ఒక విధానం ఉందని. కేసీఆర్ పార్టీలగా నియంతృత్వ పార్టీ కాదు అని విమర్శించారు.
చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ నుంచి బయటికొచ్చిన ప్రజ్ఞాన్ రోవర్ కదలికలన్నింటినీ ధ్రువీకరించామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తెలిపింది. చంద్రయాన్-3 రోవర్ 'ప్రజ్ఞాన్' ఎనిమిది మీటర్ల దూరం విజయవంతంగా ప్రయాణించిందని, దాని పేలోడ్లను ఆన్ చేసినట్లు ఇస్రో శుక్రవారం వెల్లడించింది.
అంగన్వాడి టీచర్లు, హెల్పర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు.
ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సమక్షంలో తెలంగాణ IMA ప్రెసిడెంట్ డాక్టర్ బీఎన్ రావు, పలువురు డాక్టర్లు BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి ఒక స్ట్రాంగ్ లీడర్ కావాలా.. లేదా రాంగ్(wrong) లీడర్ కావాలా ప్రజలు ఆలోచన చేయాలని హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాంగ్ లీడర్ల చేతిలోకి పోతే రాష్ట్రం వెనక్కి పోతుందని ఆయన పేర్కొన్నారు.
ఎల్బీనగర్ పీఎస్ లో మహిళపై దాడి ఘటనపై బాధితుల తరపు కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నాయకులు మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. కమిషన్ ఫర్ ఎస్సీ ఎస్టీతో పాటు రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు.
గ్రీస్లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోడీకి అత్యున్నత గౌరవం దక్కింది. ప్రధాని మోడీకి గ్రీస్లోని ఏథెన్స్లో శుక్రవారం 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్ అవార్డు' లభించింది.
సీెం కేసీఆర్ ను తక్కువ అంచనా వేయకూడదని.. అతని రాజకీయ చతురత ముందు ఎవ్వరూ నిలవలేరని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. సీఎం కేసీఆర్ కు ప్రధాని అభ్యర్థికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయని అసద్ పేర్కొన్నారు
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 12 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ జీప్ వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్హాల్ గ్రామ పంచాయతీలో లోయలో పడింది. ఈ ఘటనలో జీప్లో ఉన్న తొమ్మిది మంది కూలీలు మృతి చెందారు.