పదేళ్ల క్రితం ఘటన గుర్తుకు వచ్చి కదులుతున్న ఆర్టీసీ బస్సులో నుంచి దూకి మరీ మహంకాళి ఏసీపీ రవీందర్ కు దండం పెట్టింది ఓ వృద్ధురాలు. వేగంగా పరిగెత్తుకుంటు రావడం చూసి బస్సులో ఏమైనా మరిచిపోయి ఉండి బస్సు కోసం పరుగున వెళ్తుంది అనుకున్నారు. కాని సదరు మహిళ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్ ను కలవడానికి తెలుసుకొని ఆశ్చర్య పోయారు.
Read Also: BRO : ఓటీటీ లో అదరగొడుతున్న పవర్ ప్యాక్డ్ మూవీ..
అసలు విషయానికొస్తే.. పదేళ్ల క్రితం వృద్ధురాలు కవిత ప్రాణాలు కాపాడారు ఏసీపీ రవీందర్. 2014 సంవత్సరంలో టప్పాచ భుత్ర ఇన్స్పెక్టర్ గా ఉన్నప్పుడు కార్వాన్ కు చెందిన కవిత రోడ్డు పై అనారోగ్యంతో బాధ పడుతుంటే తన సొంత డబ్బులతో ఆస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. దీంతో ఆమే ఏసీపీని కలవడానికి అవకాశం లభించలేదు. అదృష్టవశాత్తు ఆ వృద్ధురాలు బస్సులో వెళ్తుండగా ఏసీపీని గుర్తు పట్టి.. బస్సు మధ్యలో దిగి వచ్చి కలిసి సంతోషంలో మునిగిపోయింది. ఈ రోజు బ్రతికి ఉన్నానంటే మీరే సార్ అని కన్నీరు పెట్టుకుంది. నువ్వే నా దేవుదంటూ ఏసీపీ రవీందర్ ను పట్టుకొని ఏడ్చింది ఆ వృద్ధురాలు.
Read Also: France: ఇది తెలిస్తే మందుబాబుల గుండె పగిలిపోతుంది.. ఆల్కహాల్ ను కొని నాశనం చేస్తున్న ప్రభుత్వం
ఈ ఘటన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో చోటు చేసుకుంది. ఇది చూసిన కానిస్టేబుళ్లు, స్థానికులు ఆశర్యపోయారు. అన్న నీ కోసం వెండి రాఖీ కొన్న వచ్చి కడుతానని ఆనందం వ్యక్తం చేసింది. మహిళా ఫోన్ లో ఉన్న ఏసీపీ ఫోటో చూసి ఆమె కృతజ్ఞతకు ఏసీపీతో పాటు అందరు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏసీపీ ఫోన్ నెంబర్ తీసుకోని ఆనందంగా వెళ్లి పోయింది. దీంతో స్థానికులు ఏసీపిని అభినందించారు.