దాణా కుంభకోణం కేసులో వైద్య కారణాలతో బెయిల్ పొందిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ బ్యాడ్మింటన్ ఆడుతున్నారని, బీహార్ మాజీ ముఖ్యమంత్రికి మంజూరైన ఉపశమనాన్ని రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఆరు నూరైనా నా ప్రాణం అడ్డేసి మీ అందర్నీ కాపాడుకుంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా జీవితంలోనే ఉంటానని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.
భూములను అమ్ముకోవడాని కేసీఆర్ కామారెడ్డికి వస్తున్నారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు. కామారెడ్డి నుంచే సీఎం కేసీఆర్ పతనం ప్రారంభం అవుతుందని.. ఆ పార్టీని భూస్థాపితం చేద్దామని అన్నారు.
చంద్రునిపై పరిశోధనలు జరిపేందుకు ప్రయోగించిన చంద్రయాన్-3 సురక్షితంగా జాబిల్లిపై దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపగా.. కొన్ని గంటల అనంతరం రోవర్ బయటకు వచ్చి తన అధ్యయనాన్ని ప్రారంభించింది.
వేసవి కాలాన్ని విద్యుత్ డిమాండ్ అధిగమించింది. ఈరోజు ఉదయం 11 గంటల 1 నిమిషానికి రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ నమోదు అయింది. ఈరోజు 14136 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చిందని ట్రాన్స్ కో, జేఎన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు.
సెప్టెంబర్లో భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు.
చైనా, భారత్ల మధ్య 19 సార్లు చర్చలు జరిగాయని.. చైనా వాళ్లు మన భూభాగంలో ఆక్రమణలు చేస్తుంటే దేశ ప్రధాని మోడీ చైనా ప్రధాని వెనకాల ఎందుకు పడుతున్నారో అర్థం కావడం లేదని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
చేవెళ్లలో వెనుకబడిన తరగతుల శాఖ ఆధ్వర్యంలో బీసీ కులాల చేతివృత్తుల లబ్ధిదారులకు అందించే బీసీ బందు కార్యక్రమాన్ని మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ సత్తా ఏంటో తెలుస్తుందని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే చంద్రమండలం కూడా ఖతం అవుతుందని సెటైర్లు వేశారు.
తిరుపతి, ఆదిలాబాద్ మధ్య నడిచే కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. రైలులోని ఏసీ బోగీలో పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు చైన్ లాగడంతో రైలు ఆగింది.