తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలతో థాక్రే చర్చలు జరిపారు. ఈ సమావేశంలో థాక్రే ముందు సీపీఐ నేతలు ప్రతిపాదనలు ఉంచారు. సీపీఐ నాలుగు స్థానాలు కావాలని అడిగింది. మునుగోడు, హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం సీట్లను సీపీఐ ఆశించింది. అయితే కాంగ్రెస్ మాత్రం మునుగోడు, హుస్నాబాద్ స్థానాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. మూడు సీట్లు కోరిన సీపీఐ.. దీనిపై పార్టీలో చర్చ చేసి చెప్తామన్న సీపీఐ నేతలు థాక్రేకు చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీ ఇవ్వడానికి హామీ ఇచ్చింది.
Uday Kiran: ఈ టాప్ సింగర్ ఉదయ్ కిరణ్ చెల్లి అని మీకు తెలుసా..?
మరోవైపు బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పోటీ చేయమని ప్రకటించగా.. కాంగ్రెస్ తో పొత్తు చేయాలని యోచిస్తుంది. మొన్నటికి మొన్న సీఎం కేసీఆర్ 115 స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో వామపక్షాల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో వామపక్ష నాయకులు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తో జతకట్టాలని చూస్తోంది. ముందు నుంచి కాంగ్రెస్, లెఫ్ట్ మధ్య అవసరమైన సమయంలో పొత్తులు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. దీంతో టీకాంగ్రెస్ నేతలతో సీపీఐ నాయకులు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొత్తులు, ఇతర అంశాలపై తొందర పడకుండా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.