Nitish Kumar: ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు.. నితీష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు. అయితే సీట్ల పంపకం వంటి ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.
నితీష్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ.. ముంబయిలో జరగబోయే సమావేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా కూటమి వ్యూహాలను చర్చిస్తామన్నారు. సీట్ల పంపకం వంటి అంశాలు చర్చించబడతాయన్నారు. అనేక ఇతర అజెండాలు ఖరారు చేయబడతాయని నితీష్ స్పష్టం చేశారు. మరికొన్ని రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో చేరతాయన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు గరిష్ట సంఖ్యలో పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నామని.. ఆ దిశగానే పనిచేస్తున్నామన్నారు. తనకు ఎలాంటి కోరిక లేదన్నారు.
Also Read
Read Also: Uttar Pradesh: వీడు మాములోడు కాదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా చూపించాడుగా
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఏర్పాటైన 26-పార్టీల ప్రతిపక్ష కూటమి ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు సమావేశమైంది. ముందుగా జూన్ 23న పాట్నాలో, ఆపై జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండు సార్లు సమావేశమైంది. ఈ కూటమి తమ మూడో సమావేశాన్ని ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో నిర్వహించనుంది.ఇదిలావుండగా,.. పాట్నాలోని బెయిలీ రోడ్‌లోని హర్తాలీ మోర్ సమీపంలో కొనసాగుతున్న లోహియా పథ చక్ర నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. దుర్గాపూజలోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!