Yevgeny Prigozhin: విమాన ప్రమాదంలో వాగ్నర్ చీఫ్ మృతి.. జన్యు పరీక్ష ద్వారా నిర్ధారణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yevgeny Prigozhin: ఆగస్టు 23న రష్యాలో ఓ ప్రైవేట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా చనిపోయారు. ఈ సమయంలో వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా ఈ విమానంలో ఉన్నారని తెలిసింది. యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారని కూడా తెలిసింది. ప్రిగోజిన్ విమానం కూలిపోవడానికి కారణమేమిటనే దానిపై ప్రశ్నలు పెరుగుతూనే ఉన్నాయి. మాస్కో సైనిక నాయకత్వానికి వ్యతిరేకంగా వాగ్నర్ తిరుగుబాటు చేసిన సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరగడంతో, క్రాష్‌లో క్రెమ్లిన్ ప్రమేయం ఉండవచ్చనే ఊహాగానాలు విస్తృతంగా పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు రష్యా యెవ్జెనీ ప్రిగోజిన్ మరణాన్ని ధృవీకరించింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలోనే మరణించారని, ఇది జన్యు పరీక్ష ద్వారా ధృవీకరించబడిందని రష్యా తెలిపింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్ గత వారం జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు జన్యు పరీక్షలు నిర్ధారించాయని రష్యా పరిశోధకులు ఆదివారం తెలిపారు. ఈ విమానంలో 10 మంది ఉన్నారని, వారు ప్రమాదంలో మరణించారని రష్యా చెప్పింది.
Read Also: Amit Shah: తెలంగాణలో కేసీఆర్ పాలనకు నూకలు చెల్లాయి.. వచ్చేది బీజేపీ ప్రభుత్వమే
Also Read
- Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
- Telangana Bar Licences Draw : లక్కీ డ్రాలో లక్ ఎవరికో?.. రాష్ట్రంలో బార్ల కేటాయింపునకు సర్వం సిద్ధం..
- EPFO ECR Filing Deadline: వేతన పరిమితి మార్పులతో ECR ఫైలింగ్‌లో మార్పులు.. EPFO కీలక నిర్ణయం
- Nepal: చైనాను కాదని, భారత్‌కే ఓటేసిన నేపాల్ ప్రధాని..
అంతకుముందు, రష్యాకు చెందిన ఏవియేషన్ ఏజెన్సీ ప్రైవేట్ జెట్‌లోని వ్యక్తులందరి పేర్లను పంచుకుంది. యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని విమానయాన సంస్థ తెలిపింది. ట్వెర్ ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంపై జన్యు పరీక్షలు పూర్తయినట్లు రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జన్యు పరీక్ష ఫలితాల ప్రకారం మరణించిన 10 మందిని గుర్తించినట్లు తెలిపింది. ఈ ప్రమాదంలో మరణించిన యెవ్జెనీ ప్రిగోజిన్ కూడా విమానంలో ఉన్నారని ఈ పరీక్షలో తేలిందని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ ప్రతినిధి స్వెత్లానా పెట్రెంకో తెలిపారు. అయితే విమానం కూలిపోవడానికి గల కారణాలను రష్యా అధికారులు వెల్లడించలేదు. యెవ్జెనీ ప్రిగోజిన్ రెండు నెలల క్రితం పుతిన్‌పై తిరుగుబాటు చేశారని తెలిసింద. ఈ తిరుగుబాటు జరిగిన రెండు నెలల తర్వాత ఈ సంఘటన జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జూన్ 23-24 తిరుగుబాటును వెన్నుపోటుతో పోల్చారు.
ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు పుతిన్ తన సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు. అదే సమయంలో, పుతిన్ ఆదేశాల మేరకే ప్రిగోజిన్ హత్యకు గురయ్యాడని పాశ్చాత్య దేశాల నాయకులు పేర్కొన్నారు. అదే సమయంలో, క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ పాశ్చాత్య దేశాల నాయకుల ఆరోపణలను తప్పు అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
iPhone Duo Repair Cost: రూ.3 లక్షల iPhone Duo.. స్క్రీన్ రిపేర్‌కే రూ.1.49 లక్షలు! రిపేర్ ధరల పూర్తి జాబితా ఇదే
-
January 12 Vidudala నుంచి ఫస్ట్ సింగిల్ రెడీ! అనిల్ రావిపూడి ప్లాన్ ఇదేనా?
-
Bhindi Health Benefits: బెండకాయ జిగురును చూసి దూరం పెడుతున్నారా? ప్రయోజనాలు తెలిస్తే షాకే..!
-
TVS Raider 125 Updated: TVS Raider 125 బైక్ కొత్త ఫీచర్లతో అప్డేట్.. ట్రాక్షన్ కంట్రోల్, టైప్-C ఫాస్ట్ ఛార్జింగ్!
-
Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!