మహిళలు, ఆడపిల్లలపై అత్యాచారాల ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు చేసినా వీటిలో మార్పు రావడంలేదు.
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రపంచ వ్యాప్తమయింది. ఈ తరుణంలో ప్రపంచ దేశాల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా జాబిల్లిపై దాగి ఉన్న రహస్యాలు తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్ జీవితకాలం కేవలం 14 రోజులే కావడం గమనార్హం.
అక్టోబర్ రెండో వారంలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి ముందు బీజేపీ రాజకీయ సమీకరణాలపై కసరత్తు ప్రారంభించింది. అసంతృప్తులను శాంతింపజేసేందుకు పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పుడు పార్టీ ప్రాంతీయ, కుల సమీకరణాలకు అనుగుణంగా మంత్రివర్గాన్ని విస్తరించబోతోంది.
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు. గురువారం (ఆగస్టు 24) నాటి తన పర్యటనకు సంబంధించిన అనేక ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అందులో అతను కార్గిల్‌లోని సైనిక సిబ్బందితో కలిసి కనిపించాడు. అంతేకాకుండా.. దేశ సరిహద్దులను రక్షించే వీర సైనికులను కాంగ్రెస్ ఎంపీ ప్రశంసించారు.
మహిళల భద్రతపై బీజేపీ నేత సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్లో మహిళల భద్రత కోసం అవసరమైతే పోలీసులు ఎన్కౌంటర్లను ఆశ్రయించాలని సువేందు అధికారి బుధవారం అన్నారు.
భారతదేశం బుధవారం చంద్రయాన్-3తో చరిత్ర సృష్టించింది. చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర రోవర్‌ను ల్యాండ్ చేసిన మొదటి దేశంగా అవతరించింది. ఈ విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశంసించారు.
ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టోర్నీకి ముందు బెంగళూరులో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటలు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే.. 13 రోజుల ఫిట్నెస్ ప్రోగ్రామ్‌లో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 వారాల విరామంలో ఉన్న రోహిత్-కోహ్లీతో సహా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రోగ్రామ్ చార్ట్‌ను సిద్ధం చేసింది.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్రంగా మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే కుట్రలో భాగంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టాన్ని కొద్దికొద్దిగా చంపేస్తోందని ఖర్గే ఆరోపించారు.