Fire Accident: శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం.. 15 దుకాణాలు దగ్ధం!
Huge Fire Accident in Srisailam Temple: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. లలితాంబికా షాపింగ్ కాంప్లెక్స్‌లో అర్ధరాత్రి దాటాక ఎల్ బ్లాక్ సముదాయంలో భారీగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో దాదాపు 15 షాపులు కాలి బూడిదయ్యాయి. అప్రమత్తమైన దేవస్థానం అధికారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపులోకి తెచ్చారు. మల్లన్న ఆలయ సమీపంలోని లలితాంబిక షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలలో బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. ఎల్ బ్లాక్‌లో దాదాపుగా 15 దుకాణాలు మంటలతో దగ్దమయ్యాయి. ఓ దుకాణంలో చెలరేగిన మంటలు.. పక్కన ఉన్న దుకాణాలకు వేగంగా వ్యాపించాయి. దుకాణదారులు విద్యుత్ శాఖకు ఫోన్ చేసి.. పవర్ కట్ చేయించారు. అయితే అప్పటికే సుమారు 15 బొమ్మలు, గాజులు, దేవుడి ఫోటోల దుకాణాలకు మంటలు వ్యాపించాయి.
AP Government: కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సాయం
AP Government: ఏపీలోని కౌలు రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు రైతులకు రైతు భరోసాను అందించనున్నారు. సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ను నొక్కి నగదు జమ చేస్తారు. అర్హులైన రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతుంది. కౌలు రైతులతో పాటు దేవాదాయ భూముల సాగుదారులకు కూడా సాయం అందుతుంది. 1,46,324 మంది అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు పంట హక్కు పత్రాలు పొందిన వారిలో రూ. 109.74 కోట్ల సహాయం రూ. ఒక్కొక్కటి 7,500. కౌలు రైతుల కుటుంబాలతో పాటు దేవాదాయ, అటవీ భూముల సాగుదారులకు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మూడు విడతలుగా రూ.13,500 పెట్టుబడి సాయం అందజేస్తున్నారు.
Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అప్డేట్..
Madhapur Drugs: మాదాపూర్ డ్రగ్స్ పార్టీ కేసు భాగ్యనగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే.. దీనిపై నార్కోటిక్స్ అధికారుల విచారణ వేగవంతం చేశారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోనికి వచ్చాయి. స్థానిక పోలీసులతో కలిసి జరిపిన దాడుల్లో సినీ నిర్మాత వెంకట్‌తో పాటు మరో ఐదుగురు బాలాజీ, కె.వెంకటేశ్వర రెడ్డి, డి.మురళి,మధుబాల, మేహక్ అనే యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. బాలాజీ పై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. డమరుకం, పూల రంగుడు, లైవ్లీ,ఆటో నగర్ సూర్య సినిమాకు ఫైనాన్సియర్ గా వెంకట్ పని చేసినట్లు గుర్తించారు. సినీమా ఫైనాన్సర్ వెంకట్ అద్వర్యంలో డ్రగ్స్ పార్టీ నిర్వహణ జరగుతుందని వెల్లడించారు. గోవా నుండి డ్రగ్స్ తెచ్చి డ్రగ్స్ పార్టీలు వెంకట్ నిర్వయిస్తున్నారు. వెంకట్ కదిలికలపై గత మూడు నెలలుగా నార్కోటిక్ బ్యూరో నిఘా పెట్టారు. వెంకట్ కు డ్రగ్స్ మాఫియా పై సంబంధాలు పై ఆరా తీస్తున్నారు. వెంకట్ వాట్సప్ చాట్ లో డ్రగ్స్ పార్టీ పై చాటింగ్ చేసినట్లు గుర్తించారు. అయితే వెంకట్ ఫోన్ మిస్ అయినట్లు తెలిపారు.
Secunderabad: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్..
Secunderabad: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త అందించారు. ఇకపై సబర్బన్ స్టేషన్ల నుంచి ప్రయాణాలు కొనసాగించవచ్చని వెల్లడించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు రోజురోజుకు రద్దీగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో లింగంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల నుంచి సుదూర ప్రాంతాలకు సేవలు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే లింగంపల్లి – విజయవాడ ఉద్యోగుల ప్రత్యేక ఇంటర్‌సిటీ రైలు, గౌతమి, కాకినాడ, జన్మభూమి రైళ్లు లింగంపల్లి నుంచి బయలుదేరుతున్నాయి. ఇటీవల లింగంపల్లి రైల్వే స్టేషన్‌కు విచ్చేసిన దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ ఏర్పాట్లను పరిశీలించారు. హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్షించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లు ఇక్కడ ఆగితే 50 శాతం మంది ప్రయాణికులు ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తున్నట్లు గుర్తించారు. కాచిగూడ నుంచి విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరులకు రైళ్లను పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నేరుగా మల్కాజిగిరి, మౌలాలి రైల్వే స్టేషన్లలో ఆగేలా చర్యలు తీసుకుంటున్నారు.
Manipur Violence: మణిపూర్ హింసాకాండపై దర్యాప్తును చేపట్టిన సీబీఐ
Manipur Violence: మణిపూర్ హింసాత్మక కేసులపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు దాదాపు 27 కేసులు నమోదయ్యాయి. ఇందులో 19 కేసులు మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించినవే. మే 3న రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండలో ఇప్పటివరకు 160 మందికి పైగా మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. 60 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. మణిపూర్ పోలీసులు 27 కేసులను సీబీఐకి అప్పగించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో 19 కేసులు మహిళలపై నేరాలకు సంబంధించినవి. ఇవే కాకుండా ఆయుధ దోపిడీ, హత్యకు సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. సీబీఐ అధికారుల విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పలువురు అనుమానితులను, బాధితులను విచారిస్తున్నారు. ఈ 27 కేసుల్లో 19 మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని వార్తా సంస్థ పీటీఐ వర్గాలు తెలిపాయి.
Opposition Parties: రెండ్రోజుల సమావేశం.. ‘ఇండియా’ కూటమి లోగో విడుదల
Opposition Parties: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఈరోజు అంటే గురువారం (ఆగస్టు 31) 2 రోజుల ఇండియా కూటమి సమావేశం జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు అనధికారిక సమావేశం జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఉద్ధవ్ ఠాక్రే విందు ఇవ్వనున్నారు. మరుసటి రోజు అంటే సెప్టెంబర్ 1న ఉదయం 10.15 గంటలకు ఇండియా కూటమి గ్రూప్ ఫోటో సెషన్ ఉంటుంది. లోగో (కూటమి చిహ్నం) ఆవిష్కృతమవుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు మహారాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో భోజనం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహిస్తారు.
Gold Price Today: పసిడి ప్రియులకు షాక్..
Gold Today Price in Hyderabad on 31st August 2023: పసిడి ప్రియులకు షాక్. వరుసగా రెండోరోజు బంగారం ధరలు పెరగ్గా.. నేడు మరింత ప్రియం అయింది. బులియన్ మార్కెట్‌లో గురువారం (ఆగష్టు 31) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,000గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 300.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 330 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేడు ఉదయం నమోదైనవి. ఇక దేశంలోని పలు నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
IND vs PAK: క్రికెట్ అభిమానులకి బ్యాడ్ న్యూస్..
Rain may disrupt India vs Pakistan Asia Cup 2023 match on Sep 2: ఆసియా కప్ 2023 ఆరంభం అయింది. బుధవారం ముల్తాన్ వేదికగా నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ ఘన విజయం సాధించింది. నేడు పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మెగా మ్యాచ్ శనివారం (సెప్టెంబర్ 2) జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ జరగడం కష్టమే అని సమాచారం తెలుస్తోంది.
Pawan Kalyan: మరో 48 గంటల్లో సోషల్ మీడియాని తాకనున్న పవన్ తుఫాన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వస్తుంది అంటే మెగా అభిమానుల్లో వచ్చే జోష్, ఏ పండగకి తక్కువ కాదు. ఆన్లైన్ ఆఫ్లైన్ అనే తేడా లేకుండా పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మాములుగా ఉండదు. హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ లోనే బెంచ్ మార్క్ ఇవి అనిపించే రేంజులో సంబరాలు చేయడం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి తెలిసినంతగా ఇంకొకరికి తెలియదు. ఎప్పటిలానే ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్ కి గ్రాండ్ సెలబ్రేషన్ కి ఫ్యాన్స్ రెడీ అయ్యారు. మరో 48 గంటల్లో ఈ సెలబ్రేషన్ పీక్ స్టేజ్ కి చేరి సోషల్ మీడియాని కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసుకోనున్నాయి. అభిమానుల హ్యాపినెస్ ని మరింత పెంచుతూ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల నుంచి అప్డేట్స్ బయటకి రాబోతున్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి సినిమాల నుంచి పవన్ బర్త్ డే ట్రీట్ గా పోస్టర్లు, గ్లిమ్ప్స్ లు రిలీజ్ అవుతున్నాయి. క్రిష్ తెరకెక్కిస్తున్న హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక పవర్ ఫుల్ పోస్టర్ ని విడుదల చేయనున్నారు.
Leo: ఇంకా 50 డేస్ ఉంది కదండీ… అప్పుడే ఇలా చేస్తే ఎలా?
సోషల్ మీడియాలో కబ్జా చేసింది లోకేష్ కనగరాజ్-దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్. #LeoRoarsIn50DAYS అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన ఫ్యాన్స్… మరో 50 రోజుల్లో లియో రాబోతుంది అంటూ హంగామా చేస్తున్నారు. 50 డేస్ కి ముందే ఈ రేంజ్ హంగామాని కోలీవుడ్ లో ఈ మధ్య కాలంలో చూడలేదు. విజయ్ కి సంబంధించిన చిన్న వార్త బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తారు అలాంటిది ఏకంగా సినిమానే బయటకి వస్తుందంటే సైలెంట్ గా ఉంటారా, అందుకే ఈ సెలబ్రేషన్స్ పైగా లియో డైరెక్ట్ చేస్తుంది లోకేష్ కనగరాజ్ అవ్వడం…. లియో కోసం అభిమానులు మాత్రమే కాకుండా రెగ్యులర్ మూవీ లవర్స్ కూడా వెయిట్ చేసేలా చేస్తోంది.
Salaar Trailer: బెంగుళూరులో ‘డైనోసర్’ని కలవనున్న ‘మాన్‌స్టర్’…
ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర నమోదైన రికార్డ్స్ కి ఎండ్ కార్డ్ వేసి, కొత్త బెంచ్ మార్క్ సెట్ చేయడానికి సలార్ వస్తుంది. రెబల్ స్టార్ ప్రభాస్-పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం రిలీజ్ కానున్న సినిమాల్లో సలార్ మైంటైన్ చేస్తున్న హైప్, ఏ ఇండియన్ సినిమాకి లేదు. ప్రభాస్ ఫేస్ కూడా రివీల్ చేయకుండా కట్ చేసిన గ్లిమ్ప్స్ కి 24 గంటల్లో 83 మిలియన్ వ్యూస్ వచ్చాయి అంటే సలార్ పై అంచనాలు ఏ రేంజులో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేయడానికి సలార్ ట్రైలర్ బయటకి రాబోతుంది. సలార్ రిలీజ్ కి నెల రోజుల సమయం మాత్రమే ఉంది, మేకర్స్ మాత్రం ప్రమోషన్స్ చెయ్యట్లేదు అంటూ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. నిజానికి సలార్ సినిమాపై ఉన్న అంచనాలకి ప్రమోషన్స్ అంతగా చేయాల్సిన అవసరం లేదు.