రేపు శ్రీలంక రాజధాని కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగే టైటిల్ మ్యాచ్‌లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో తలపడనుంది. శ్రీలంక కంటే భారత్ జట్టు చాలా బలంగా ఉన్న.. లంకేయుల జట్టులో ఓ ఆటగాడు టీమిండియాను టెన్షన్‌కి గురిచేస్తున్నాడు. ఇంతకుముందు జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు.. ఈ ఆటగాడు భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపించాడు.
పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద నిర్మించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. breaking news, latest news, telugu news, cm kcr, nagarkurnool
బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జవాన్ల బలిదానాలకు యావత్ దేశం దుఃఖించిందని.. మన సైనికులు అమరులైన సమయంలో ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు జరుపుకోవడం మరింత బాధాకరమన్నారు.
జనసేన అధినతే పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు.
కునో నేషనల్ పార్క్ లో చిరుతల మరణాలను అక్కడి అధికారులు బయటపెట్టారు. చిరుతలపై మందపాటి వెంట్రుకలు, అధిక తేమ, ఉష్ణోగ్రతలతో వాటికి దురదను కలిగిస్తాయి. దాంతో అవి చెట్ల కొమ్మలపై లేదా నేలపై తమ మెడను రుద్దుతాయి. ఆ కారణంగా వాటి మెడపై చర్మం నలిగిపోయి.. దానిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి. అందువల్ల వాటిలో వైరల్ ఇన్ఫెక్షన్ సెప్టిసిమియా (రాట్) కు దారితీసి.. అవి చనిపోతాయని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సనతాన ధర్మంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి (INDIA)ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్, విపక్షాల కూటమిపై మండిపడ్డారు.
జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపైన్ శుక్రవారం(సెప్టెంబర్ 15) నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలన్నీ అందించటమే దీని లక్ష్యమన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంత్‌నాగ్‌లో భారత సైనికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని, ప్రభుత్వం మౌనంగా ఉందని మండిపడ్డారు. రాజౌరిలో కాశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో బుల్లెట్ల క్రికెట్ మ్యాచ్ జరుగుతోందని విమర్శలు చేశారు.
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. మాడవీధులలో గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు పాటు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామన్నారు.