Pawan Kalyan Varahi Yatra: నాలుగో విడత వారాహి యాత్రకు సిద్దమవుతున్న పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వారాహి యాత్ర విడత వారీగా కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు చేపట్టిన వారాహి యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ నాలుగో విడత యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఈనెల 21వ తేదీన కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేనాని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల టీడీపీ కలిసి ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందన్న ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Also Read: CM KCR: పాలమూరు జిల్లాలో పుట్టిన నేతలే ప్రాజెక్టును అడ్డుకున్నారు..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- OTR: నామినేటెడ్ పోస్టులు ఫర్ సేల్? ఒక్కో పోస్టుకు ఒక్కో రేటు?
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
తన వారాహి యాత్రలో ప్రధానంగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డ పవన్.. నాలుగో విడత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు.. ఈ యాత్రకు సంబంధించిన ప్రాంతాల్లో ఉండే సమస్యల గురించి తెలుసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందని ఎదురు చూస్తు్న్న జనసైనికులు సెప్టెంబర్ 21 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర ప్రారంభమవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందని, దాన్ని అంతం చేసేందుకు టీడీపీతో కలిసి పోటీ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. వైసీపీ పాలన అంతం కోసం ఏ అవకాశం వచ్చినా వదలనని ఆయన గతంలో చెప్పకనే చెప్పారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా కలిసొచ్చే పార్టీలతో కలిసి వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం ఏదైనా చేస్తానని పదే పదే పవన్ చెబుతున్నారు. చంద్రబాబును పరామర్శించిన తర్వాత చేసిన ప్రకటన హాట్ టాపిక్‌గా మారింది. జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని పవన్ ఫుల్ క్లారిటీ ఇవ్వటంతో అటు టీడీపీ నేతలు, ఇటు జనసేన నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..