దక్షిణాఫ్రికా నుంచి భారత్ కు మళ్లీ కొన్ని చిరుతలు రానున్నాయి. వాటిని మధ్యప్రదేశ్‌లోని గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో వదిలేయనున్నారు.ఈ అభయారణ్యంలో చిరుతపులులను వదిలేయడానికి సన్నాహాలు చేస్తున్నారని.. ఈ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చీఫ్ ఎస్పీ యాదవ్ అన్నారు.
Read Also: CM KCR: కొల్లాపూర్ లో బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగం
ఈసారి శీతాకాలంలో మందంగా వెంట్రుకలు ఉండని చిరుతలు రానున్నట్లు ప్రాజెక్ట్ చీతా హెడ్ తెలిపారు. వాస్తవానికి.. ఆఫ్రికా నుండి భారతదేశానికి తీసుకువచ్చిన కొన్ని చిరుతలు మందపాటి వెంట్రుకల కారణంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఈ కారణంగానే మూడు చిరుతలు కూడా మృతి చెందాయని ఆయన తెలిపారు. ఈ సారి చిరుతల పెంపకంపై పూర్తి శ్రద్ధ కనబరుస్తున్నట్లు ప్రాజెక్ట్ చిరుతల హెడ్ తెలిపారు. చిరుతలు ధరించే రేడియో కాలర్‌ల వల్ల ఎటువంటి ఇన్‌ఫెక్షన్‌తో బాధపడలేదని ఆయన చెప్పారు. అయితే ఈ కాలర్‌లను అదే దక్షిణాఫ్రికా తయారీదారు తయారు చేసిన కొత్త కాలర్‌లతో భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
Read Also: Himanta Biswa Sharma: రాహుల్పై అస్సాం సీఎం సెటైర్లు.. గాంధీ పేరు పెట్టుకుంటే గాంధీ అవుతారా..?
మరోవైపు కునో నేషనల్ పార్క్ లో చిరుతల మరణాలను అక్కడి అధికారులు బయటపెట్టారు. చిరుతలపై మందపాటి వెంట్రుకలు, అధిక తేమ, ఉష్ణోగ్రతలతో వాటికి దురదను కలిగిస్తాయి. దాంతో అవి చెట్ల కొమ్మలపై లేదా నేలపై తమ మెడను రుద్దుతాయి. ఆ కారణంగా వాటి మెడపై చర్మం నలిగిపోయి.. దానిపై ఈగలు వాలి గుడ్లు పెడతాయి. అందువల్ల వాటిలో వైరల్ ఇన్ఫెక్షన్ సెప్టిసిమియా (రాట్) కు దారితీసి.. అవి చనిపోతాయని తెలిపారు. ఇదిలా ఉంటే.. గతేడాది సెప్టెంబర్ 17న నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో ప్రధాని మోడీ విడుదల చేసి.. ప్రాజెక్ట్ చిరుతను ప్రారంభించారు. ఇది ఆదివారం (సెప్టెంబర్ 17)తో సంవత్సరం పూర్తి అవుతుంది.