రాజస్థాన్ పేపర్ లీక్ కేసులో ఈడీ కీలక చర్యలు తీసుకుంది. రాజస్థాన్ పబ్లిక్ కమిషన్ సభ్యులు అనిల్ కుమార్ మీనా, బాబులాల్ కటారాలను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. మూడు రోజుల పాటు ఈడీ కస్టడీ కోరింది.
దేశంలోని ప్రధాన ఆలయాలలో పూరీ జగన్నాథ్ ఒకటి. అయితే ఆ ఆలయంలో స్వామి సేవ కార్యక్రమాలు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిలిచిపోయాయి. ఉదయం 8.30 గంటలకు మొదటి నైవేద్యాన్ని సమర్పించవల్సి ఉండగా.. సాయంత్రం 5.30 గంటలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదు.
విశాఖపట్నంలోని హనుమంత వాక దగ్గర వాటర్ పైప్‌లైన్ పగిలి పోవడంతో నీరు ఫౌంటెన్లా భారీగా పైకి ఎగిసిన పడుతోంది. పైపుల నాణ్యతలో లోపమో లేదా ఆకతాయిల పనో తెలియదుకానీ, పెద్దమొత్తంలో నీరైతే బయటకు వృథాగా పోయింది.
మహాదేవ్ గ్యాంబ్లింగ్ యాప్ నిర్వహించే కింగ్‌పిన్ సౌరభ్ చంద్రకర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో దుబాయ్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి రూ.200 కోట్లు ఖర్చు చేసి ఘనంగా చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వివాహానికి ఇండియా నుంచి తన బంధువులే కాకుండా.. పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరైనట్లు ఈడీ తెలిపింది.
కేంద్రమంత్రి అమిత్ షా శనివారం బీహార్‌లో పర్యటించారు. ఝంజర్‌పూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లపై విరుచుకుపడ్డారు. బీహార్ దుస్థితికి నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ బాధ్యులని విమర్శించారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో ఈనెల 18 నుండి 27 వరకు వినాయకచవితి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. రత్నగర్భగణపతి, సాక్షిగణపతికి, పంచలోహమూర్తికి వ్రతకల్ప విశేషార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించనున్నారు.
నామమాత్రమైన మ్యాచ్‌లో టీమ్ఇండియా ఓడిపోయింది. కొలంబో వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. breaking news, latest news, telugu news, big news, bangladesh, india, asiacup 2023