దేశ వ్యాప్తంగా సనతాన ధర్మంపై తీవ్ర దుమారం చెలరేగుతున్న విషయం తెలిసిందే. విపక్షాల కూటమి (INDIA)ని టార్గెట్ గా చేసుకుని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే తాజాగా.. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కాంగ్రెస్, విపక్షాల కూటమిపై మండిపడ్డారు. సనాతన ధర్మానికి సంబంధించి ‘INDIA’ కూటమిలో భాగమైన డీఎంకే నేతలు ఉదయనిధి స్టాలిన్, ఏ రాజా, కే పొన్‌ముండి చేసిన ప్రకటనపై బిస్వా శర్మ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డీఎంకే పార్టీని కూటమి నుంచి ఎందుకు తప్పించడం లేదని అన్నారు.
Read Also: Tamil Nadu: కులం అడ్డుగోడలు ఛేదించారు.. తొలిసారి ఆలయ పూజారులుగా ముగ్గురు మహిళలు..
మధ్యప్రదేశ్‌లో ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ కొత్త కూటమిని ఏర్పాటు చేసిందని.. దీనికి ఇండియా అని పేరు పెట్టారన్నారు. అయితే వారు కూటమిని రూపొందించాక.. భారతదేశంగా మారాము అని చెప్పడం ప్రారంభించారని.. ఇవన్నీ రాబోయే ఎన్నికల్లో భాగమేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఇండియా అని పేరు పెట్టారని తెలిపారు. నేను రేపు మహాత్మా గాంధీ పేరు పెట్టుకుంటే.. నేను మహాత్మా గాంధీని కాగలనా? నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరు తీసుకుంటే.. నేను నేతాజీ అవుతానా అని వ్యాఖ్యానించారు.
Read Also: Tummala Nageswara Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు
సనాతన ధర్మంపై మాట్లాడుతూ.. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన్‌ను మలేరియాగా అభివర్ణించారని.. ఎ. రాజు హిందూ మతం ఒకటే అన్నారని తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ హిందూ మతానికి హోదా లేదని అన్నారని బిస్వా శర్మ పేర్కొన్నారు.
భారతదేశంలో ఏ అభివృద్ధి జరిగినా అది హిందువుల వల్లనే అని బిశ్వ శర్మ అన్నారు. రాహుల్ గాంధీ స్నేహితులు సనాతన్ ను మలేరియా, ఎయిడ్స్ అని అంటుంటే.. వారిని కూటమి నుండి తప్పించువచ్చు కదా అని ప్రశ్నించారు.