మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయిన 200 మందికి పైగా ప్రాణాలను రక్షించింది అక్కడి ప్రభుత్వం.
2024 ఎన్నికల్లో జనసేన బలమైన స్థానాలకో ఏపీ అసెంబ్లీలోకి అడుగు పెడుతోందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పవర్ షేరింగు తీసుకునే జనసేన వెళ్తోందన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఓ నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు బీజేపీ నేత గోదావరి అంజిరెడ్డి. ఇటీవల చనిపోయిన నిరుపేద ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక సాయంగా ఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరి అంజిరెడ్డి రూ.20 లక్షలు అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు.
జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ప్రత్యేక పరిస్థితుల్లో విస్తృత స్థాయీ సమావేశం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దుర్మార్గపు పాలనను కొత్తగా వచ్చిన పదేళ్ల పార్టీ ఎలా ఎదుర్కొబోతోందో తరచి చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యాధునిక హంగులతో నిర్మించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నర్సింగ్ కళాశాల నూతన భవనం విద్యార్థులకు అందుబాటులోకి వచ్చింది. TSRTC Nursing College, telugu news, breaking news, vc sajjanar, bajireddy govardhan reddy
ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్‌నగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. నడిరోడ్డుపై అగంతకులు చేసిన వేధింపులకు విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
వినాయక చవితి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే గణేష్ మండపాలకు నిరంతరాయ విద్యుత్ సరఫరా, భద్రతా పరంగా విద్యుత్ శాఖ చేపట్టిన పనులను చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రఘుమా రెడ్డి సమీక్షించారు.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. బషీర్‌బాగ్, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, మెహదీపట్నం, అఫ్జల్‌గంజ్‌లో వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. breaking news, latest news, telugu news, big news, hyderabad rains