ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) కోశాధికారి మరియు ఎంపీ టీఆర్ బాలు, డీఎంకే యువజన విభాగం అధినేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు హెచ్చరిక నోట్ జారీ చేశారు. తన రాజకీయ జీవితంలో జాగ్రత్తగా అడుగులు వేయాలని కోరారు.
ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు రేపటి(మంగళవారం) నుంచి కొత్త పార్లమెంట్ భవనంలో కొనసాగనున్నాయి. అయితే రేపటి నుంచి ఎంపీలు కొత్త పార్లమెంట్‌కు మారనున్నారు. అక్కడ ఎంపీలు మాట్లాడే మైక్‌లన్నీ ఆటోమేటెడ్ సిస్టమ్‌తో పని చేస్తాయని సమాచారం.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్‌కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను…
కారణం లేకుండా జీవిత భాగస్వామి ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణాలు లేకుండా శృంగారానికి దూరం పెట్టడం క్రూరత్వంతో సమానం అని కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.
వాషింగ్టన్ సుందర్ ను సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకపై వాషింగ్టన్ సుందర్ 15.2 ఓవర్లు మాత్రమే ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే వాషింగ్టన్ సుందర్ భారత జట్టుకు ఆసియా కప్ టైటిల్‌ను అందించాడని సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
బీజేపీ ఎలాంటి పొత్తు లేదని, ఎన్నికల సమయంలోనే ఎన్నికల పొత్తుపై నిర్ణయం తీసుకుంటామని ద్రవిడ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పడంతో అన్నాడీఎంకే, బీజేపీ మధ్య విభేదాలు సోమవారం తారాస్థాయికి చేరుకున్నాయి.
రేపటి(మంగళవారం) నుంచి పార్లమెంట్ కార్యకలాపాలు కొత్త భవనానికి మారనున్నాయి. పాత పార్లమెంట్ భవనం రాజ్యాంగాన్ని ఆమోదించడంతో సహా కొన్ని చారిత్రక సంఘటనలకు సాక్షిగా నిలిచిన సంగతి తెలిసిందే. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నేడు ప్రారంభం కాగా.. కొత్త పార్లమెంట్ భవనం మంగళవారం నుంచి ఉభయ సభల సమావేశాలకు వేదిక కానుంది.