Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi High Court: కారణం లేకుండా జీవిత భాగస్వామి ఎక్కువ కాలం శృంగారాన్ని నిరాకరించడం క్రూరత్వమే అని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తగిన కారణాలు లేకుండా శృంగారానికి దూరం పెట్టడం క్రూరత్వంతో సమానం అని కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. పెళ్లయిన తర్వాత కేవలం 35 రోజుల పాటే కలిసున్న ఓ జంట మధ్య వివాహ బంధం పరిపూర్ణం కాకపోవడంతో వారికి కుటుంబ న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. ఫ్యామిలీ కోర్టు అనుసరించిన విధానాన్ని సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి ఎలాంటి కారణంగా లేకుండా శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అని, ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు వెల్లడించింది.
Also Read: Clothes: ఇలాంటి డ్రెస్సులు అస్సలు వేసుకోవద్దు.. మీ ఆరోగ్యం దెబ్బతినే ఛాన్స్ ఉంది..!
Also Read
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
- Modi-Jinping: అరుదైన ఖనిజాలు, వాణిజ్య లోటు.. మోడీ-జిన్‌పింగ్ భేటీలో కీలకాంశాలు..
ఓ జంట 2004లో వివాహం చేసుకోగా.. భార్య కొన్ని రోజులకే పుట్టింటికి వెళ్లిపోయి తిరిగిరాలేదు. దీంతో ఆ భర్త కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో విచారణ చేపట్టి ఫ్యామిలీ కోర్టు వీరికి విడాకులు మంజూరు చేసింది. అయితే, ఈ విడాకులను సవాల్ చేస్తూ ఆ భార్య ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తాజాగా తీర్పు చెప్పింది. ఈ తీర్పులో శృంగారం లేని వైవాహిక బంధం శాపం లాంటిదేనని.. శారీరక బంధంలో నిరాశకు మించిన దారుణం మరొకటి ఉండదని కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులో భార్య శృంగారానికి నిరాకరించడంతో వారి వివాహ బంధం పరిపూర్ణం కాలేదని న్యాయస్థానం గుర్తించింది. అంతేగాక, ఎలాంటి ఆధారాల్లేకుండా ఆమె వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, ఎలాంటి కారణం లేకుండా ఉద్దేశపూర్వకంగా జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే అవుతుందని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన దంపతుల మధ్య ఇది దారుణ పరిస్థితి అంటూ న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అందువల్ల ఆ కారణంతో విడాకులు మంజూరు చేయొచ్చని ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది.
తాజావార్తలు
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
-
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
-
Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు ‘+91’ ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
-
Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!