ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. సిరాజ్ బౌలింగ్ చేయొద్దని కోచ్ నుంచి సందేశం వచ్చిందని చెప్పాడు. సిరాజ్ 7వ వికెట్ పడగొట్టి ఉంటే.. భారత్ తరఫున వన్డే ఇన్నింగ్స్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా స్టువర్ట్ బిన్నీ రికార్డును బద్దలు కొట్టేవాడు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ కోచ్ ఇచ్చిన సందేశంతో సిరాజ్ బౌలింగ్ చేయలేదు.
ఇటలీలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8గా నమోదైంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోఫిజిక్స్ అండ్ వాల్కనాలజీ ప్రకారం, దాని భూకంప కేంద్రం ఫ్లోరెన్స్కు ఈశాన్యమైన మరాడి సమీపంలో ఉందని నివేదించింది.
ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో బాలికను వేధించాడనే ఆరోపణతో సబ్ఇన్స్పెక్టర్ను స్థానికులు చితకబాదారు. ఈ ఘటన ఎత్మాద్పూర్ పోలీస్ స్టేషన్ బర్హాన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఒంటిపై దుస్తులు తొలగించి స్తంభానికి కట్టేసి కొట్టారు.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సాయంత్రం 6.30 గంటలకు కేంద్ర కేబినెట్ ప్రత్యేక సమావేశం జరగనుంది. పార్లమెంట్ భవనంలో కేబినెట్ భేటీ కానుంది. పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చ జరగనుంది.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. నేటి సమావేశాలు పాత పార్లమెంట్ భవనంలో జరుగుతుండగా.. మంగళవారం నుంచి నూతన భవనంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ప్రత్యేక సమావేశాల్లో ప్రసంగిస్తూ జీ20 సదస్సుపై ప్రధాని మోడీ చర్చించారు.
ప్రస్తుతం ఆహారపు అలవాట్లలో, రోజువారీ పనుల్లో మార్పు చోటుచేసుకుంది. ఈ మార్పు మనిషి ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ప్రస్తుతం చాలామంది ఎదుర్కుంటున్న సమస్య వెన్ను నొప్పి.
వినాయక చవితి వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో సందడి అంతా ఇంతా కాదు. గల్లీ గల్లీలో గణేశుడిని కొలిచి పూజిస్తారు. హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అందుకు భిన్నంగా ఉంది. ఖైరతాబాద్ గణేశుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఆసియా కప్ 2023 ఫైనల్లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించినందుకు పలువురు క్రికెట్ దిగ్గజాలు అభినందనల వర్షం కురిపిస్తున్నారు. సచిన్ టెండూల్కర్ నుంచి యువరాజ్ సింగ్ వరకు పలువురు క్రికెటర్లు అభినందనలు తెలిపారు.