కొన్ని జంతువులు బయటకి చూడటానికి చాలా ప్రశాంతంగా కనిపించినా.. లోపల మాత్రం అవి డేంజర్. మనం మొసళ్లను చూస్తే.. అవి చనిపోయినట్లుగా నేలపై పడుకుని నిశ్శబ్దంగా ఉంటాయి. కాని అవి చాలా ప్రమాదకరం. వాటి దగ్గరకు వెళ్లామంటే ఒక్కసారిగా నోరు తెరిచి మింగేయడమే. మనం కొన్ని వీడియోల్లో చూస్తుంటాం.. సింహాలు, అడవి దున్నలు నీరు తాగడానికి వచ్చినప్పుడు నీళ్లలో నుంచి నెమ్మదిగా వచ్చి పట్టేస్తాయి. ఇక దాని చెర నుంచి తప్పించుకోవడమంటే చాలా కష్టమే. అలాంటిది మనుషులు వాటి ముందుకు వెళ్లి నిలబడితే ఇంకేముంది గోవిందా.. గోవిందా. అయితే ఓ వీడియోలో మాత్రం ఓ వ్యక్తి దాని ముందుకు వెళ్లి ధైర్యంగా నిలబడి ఏం చక్కా ఆటలు ఆడుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దాన్ని చూస్తే మీకు గూస్‌బంప్స్ రావడం పక్కా.
Delhi High Court: జీవిత భాగస్వామి శృంగారానికి నిరాకరించడం క్రూరత్వమే..
వీడియోలో ఒక వ్యక్తి పెద్ద మొసలికి మాంసం ముక్కను తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కూడా తన నోటితో అందుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆ వ్యక్తి, మొసలి ఎదురెదురుగా ఉన్నట్లు చూడవచ్చు. నోటిలో మాంసం ముక్కను పెట్టుకుని మొసలికి తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. మొసలి కూడా మాంసం ముక్కను లాక్కోవడానికి ప్రయత్నిస్తుండగా.. ఆ వ్యక్తి ఒక అడుగు వెనక్కి వేస్తాడు. ఈ విధంగా అతను చాలా సార్లు మొసలిని మాంసం కోసం ప్రలోభపెట్టాడు. కాని తరువాత అతను ఆ మాంసం ముక్కను మొసలి నోటిలో పెట్టి దాన్ని లాలిస్తాడు. ఏ మాత్రం భయం లేకుండా మొసలికి మాంసం ముక్కను పెట్టడానికి వెళ్లిన ఈ మనిషి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ హృదయ విదారక వీడియో @MadVidss అనే IDతో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కేవలం 33 సెకన్ల ఈ వీడియోను ఇప్పటివరకు 14 వేలకు పైగా వీక్షించగా.. వందలాది మంది లైక్ చేశారు. అంతేకాకుండా.. నెటిజన్లు రకరకాల రియాక్షన్లు ఇస్తున్నారు.
He’s lost his mind 💀 pic.twitter.com/2A4gBpoQyf
— MadVids (@MadVidss) September 16, 2023