జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించింది. మాసాబ్ ట్యాంక్ హాకీ గ్రౌండ్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిధిగా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ హాజరయ్యారు. breaking news, latest news, telugu news, asaduddin owaisi, bjp, big news,
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన దగ్గరి నుంచి వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. చదువు కోసం స్కిల్ పేరుతో రూ.356 కోట్లు నిధులు మంజూరైతే.. చంద్రబాబు కొన్ని సెల్ కంపెనీ పేరుతో దోచుకున్నాడని దుయ్యబట్టారు.
ఆయేషా హత్య కేసులో ఆయేషా తల్లిదండ్రులను విచారించేందుకు సీబీఐ అధికారులు వచ్చారు. గుంటూరు జిల్లా తెనాలిలో వారిని కలిసిన అధికారులు.. మరొకసారి డిటైల్ స్టేట్మెంట్ ఇవ్వాలని కోరారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ టి.ఎస్.ఆర్టీసీ కేంద్ర కార్యాలయం, బస్‌భవన్ లో జాతీయ పతాకావిష్కరణ చేయడం జరిగింది. braking news, latest news, telugu news, big news, vc sajjanar, telangana formation day
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు పర్యటించారు. (సెప్టెంబర్ 15 - 28) మధ్య పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ విద్యార్థులు వెళ్లగా.. అమెరికా అధికారులు, వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.
విశాఖలో కేంద్ర సహాయ మంత్రి దేవ సింహ్ చౌహన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్ పై స్పందించారు. సరైన సమయంల్లో కేంద్ర అధినాయకత్వం స్పందిస్తుందని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడుతోందని.. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని చెప్పారు.
2023 ఆసియా కప్ ఫైనల్లో టీమిండియా శ్రీలంకను సులువుగా ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ 8వ సారి ఆసియా కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు కేవలం 50 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం భారత జట్టు కేవలం 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
నారా బ్రాహ్మణి పై మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఎటాక్ చేశారు. తన తాతను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అని తెలియదా అని అన్నారు. మరోవైపు టీడీపీ-జనసేన పొత్తుపై మాట్లాడుతూ.. జనసేన కార్యకర్తలే అంగీకరించటం లేదని విమర్శించారు. చంద్రబాబు కాళ్ళు పిసకమంటే జన సైనికులు, వీర మహిళలు సిద్ధంగా లేరని తెలిపారు. జనసేన, టీడీపీ కలిసి వచ్చినా మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.