మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోని ఎంత కూల్ గా ఉంటాడనేది అందరికి తెలిసిన విషయమే. ఇతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ధోనీ ఎక్కడికి వెళ్లిన అతని కోసం అభిమానులు ఎగపడుతూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని ధోనీపై ఉన్న ప్రేమను బయటపెట్టాడు. విమానాశ్రయంలో ధోనిని చూసి 'మహీ భాయ్ ఐ లవ్ యూ' అంటూ గట్టిగా అరిచాడు. దీనికి ధోని చిన్న చిరునవ్వు నవ్వాడు.
అప్పులోళ్ల ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంద్రప్రదేశ్ లోని ప్రకాశంజిల్లా పామూరులో చోటు చేసుకుంది.
Swachhata Hi Sewa: భారత ప్రభుత్వం 15 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2 వరకు స్వచ్ఛతా హి సేవా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. నీలం షామీ రావు, ఐఏఎస్, సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమీషనర్, ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ తెలంగాణకు మంత్రిత్వ శాఖ నుంచి నోడల్ ఆఫీసర్‌గా నామినేట్ అయ్యారు.
రూ. 2వేల నోటు శనివారం తర్వాత మామూలు కాగితంతో సమాన విలువను కలిగి ఉంటుంది. రూ. 2000 నోటును శనివారం అంటే సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏదైనా బ్యాంక్‌లో మార్చుకోకపోతే అది మరొక కాగితం మాత్రమే అవుతుందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) శుక్రవారం స్పష్టం చేసింది.
తమిళనాడులోని చెన్నైలోని సైదాపేట ప్రాంతంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి ఓ పెట్రోల్ పంపు పై కప్పు కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలు కాగా.. ఒకరు మృతి చెందారు. అంతేకాకుండా.. చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు.
పశ్చిమ బెంగాల్లో జరిగిన కోట్లాది రూపాయల స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్‌పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు అధికారిని వెంటనే మార్చాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
బీహార్‌లోని దర్భంగాలో హెల్మెట్ ధరించలేదని ఓ యువకుడిపై మహిళా పోలీసు అధికారి లాఠీచార్జి చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా భాగల్పూర్లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని చెప్పుతో చెంపదెబ్బ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి గురైన యువకుడు కానిస్టేబుల్‌తో గొడవ పడి.. కానిస్టేబుల్ యూనిఫాం చించేశాడు.
ప్టెంబర్ నెల ముగియడానికి, రూ.2000 నోటు పూర్తిగా కనుమరుగు కావడానికి ఇంకా ఒకరోజే మిగిలి ఉంది. రూ.2000 నోటును ఉపసంహరించుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించడంతోపాటు ఆ నోట్ల మార్పిడికి సెప్టెంబరు 30వ తేదీని తుది గడువుగా విధించిన సంగతి తెలిసిందే.