Crime: అప్పు లేక పోతే మనం ఎలా ఉన్న అడిగే వాళ్ళే ఉండరు. అయితే ప్రతి ఒక్కరు అప్పు చేయకూడదనే అనుకుంటారు. కానీ అవసరాలు మనతో అప్పు చేయిస్తూ ఉంటాయి. అయితే కొందరి దగ్గర తీసుకున్న డబ్బులు చెల్లిస్తున్న అప్పు మాత్రం తీరదు. అలా వడ్డీలు కడుతూనే ఉంటారు కానీ అసలు మాత్రం అలానే ఉంటుంది. ఇచ్చిన దానికి రెండింతలు తిరిగిచ్చిన ఇంకా ఇవ్వాలంటూ ఒత్తిడి చేస్తుంటారు కొందరు డబ్బులు అప్పుగా ఇచ్చినవాళ్లు. అయితే అప్పులోళ్ల ఒత్తిడిని తట్టుకో లేక ఆత్మ హత్యలు చేసుకుని చనిపోయిన వాళ్ళు కోకొల్లలు. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పామూరులో చోటు చేసుకుంది.
Read also:Beauty tips: అందంగా ఉండాలి అనుకుంటున్నారా ఈ జ్యూస్ తాగండి..
వివరాలలోకి వెళ్తే.. ఖాదర్ భాషా అనే వ్యక్తి పామూరు వెటర్నరీ ఆస్పత్రిలో వెటర్నరీ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. అతను 2018లో ఓ వ్యక్తి దగ్గర 60 వేల రూపాయలు అప్పు తీసుకున్నాడు. కాగా, పలు దఫాలుగా 2.10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించాడు. కానీ, అప్పు ఇచ్చిన సదరు వ్యక్తి ఖాదర్ భాషా అప్పు తీర్చడం లేదని కోర్టులో కేసు వేశాడు. అలానే డబ్బులు చెల్లించమని ఒత్తిడి చేశాడు. ఈ నేపథ్యంలో గత్యంతరం లేక ఖాదర్ భాషా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తాను చనిపోతున్నట్టు సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపించాడు. విషయం తెలుసుకున్న బంధువులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఈ విషయం పైన మాట్లాడిన బంధువులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన రాజకీయ ఒత్తిడుల వల్ల పట్టించుకోవటం లేదని ఆరోపించారు.